మయన్మార్‌లో కొనసాగుతున్న ఆందోళనలు.. సైన్యాన్ని అడ్డుకునేందుకు మహిళల వినూత్న ప్రయోగం..!
మయన్మార్‌లో సైనికు ఆగడాలు ఎక్కువవుతున్నాయి. సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల నిరసన కొనసాగుతోంది. ఆందోళనకారులను అణిచివేసేందుకు జుంటా(ఆర్మీ) కఠినంగా వ్యవహరిస్తోంది.
Women clothes for Myanmar protection : మయన్మార్‌లో సైనికు ఆగడాలు ఎక్కువవుతున్నాయి. సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల నిరసన కొనసాగుతోంది. ఆందోళనకారులను అణిచివేసేందుకు జుంటా(ఆర్మీ) కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రజలు వీధుల్లోకి వచ్చిన నిరసన తెలుపుతున్నారు. వారికి అడ్డుకునేందుకు సైన్యం జరిపిన కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొన్నిచోట్ల ప్రజలు దేశం విడిచి వలస పోతున్నారు. సైన్యం ఆదేశాలను పాటించలేక కొంతమంది పోలీసులు కూడా పారిపోయి వస్తున్నారు. ఇప్పటిదాకా మన దేశంలోకి 30 మంది పోలీసులు వచ్చారని మిజోరం లోకల్ పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యులతో పాటు వారు బార్డర్ క్రాస్ చేశారన్నారు. మరోవైపు జుంటా ఆరాచకాలను ఎదురిస్తూ పోరాడుతున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు, సైన్యం వీధుల్లోకి రాకుండా అడ్డుకునేందుకు అక్కడి మహిళలు కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చారు. వీధుల్లోనూ, రోడ్లపైన అడ్డంగా తాళ్లు కట్టి వాటిపై మహిళల దుస్తులను ఆరేస్తున్నారు. మయన్మార్‌లో మహిళల దుస్తుల కింది నుంచి నడిస్తే దురదృష్టం వెంటాడుతుందని మయన్మార్ దేశస్థుల నమ్మకం. దీంతో వాటి కింది నుంచి నడిచేందుకు ఎవరూ ఇష్టపడరు. ఇప్పుడు మయన్మార్ ప్రజలు ఇదే ఐడియాను ఉపయోగించి సైన్యాన్ని, పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మహిళలు రోడ్లపై ఆరేస్తున్న దుస్తుల్లో లోంగ్యీ (మహిళలు నడుముచుట్టు కట్టుకునే వస్త్రం)తోపాటు లోదుస్తులు కూడా ఉండడం గమనార్హం. లోంగ్యీ కింది నడిస్తే అదృష్టాన్ని కోల్పోతారన్నది సంప్రదాయ నమ్మకం. అందుకే వాటిని వీధుల్లో ఆరేస్తున్నట్టు సైన్యానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్న ప్రజలు తెలిపారు.
అయితే, ప్రస్తుత తరం దీనిని విశ్వసించకున్నప్పటికీ సైనికులు మాత్రం నమ్ముతారని, అది వారి బలహీనతని పేర్కొన్నారు. వారు కనుక ముందుకు రావాలని అనుకుంటే కొంత సమయం పడుతుందని, అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు ఈ ఉపాయం తమకు బాగా పనికొస్తోందని మయన్మార్ వాసులు చెబుతున్నారు.
మరోవైపు, మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ దేశ ప్రజలు చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. రాజధాని యాంగాంగ్‌తో సహా అన్ని నగరాల్లో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. మిలిటరీ తిరుగుబాటును వ్యతిరేకించాలని, మయన్మార్‌ను కాపాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో నిరసనకారులపై పోలీసులు అడ్డుకుంటున్నారు.
Read Also … ఒక్క సెల్ఫీతో డ్రైవింగ్ లైసెన్స్.. ఆన్‌లైన్‌లో లైసెన్స్ రెన్యువల్.. అందుబాటులోకి రవాణా శాఖ ఆన్‌లైన్ సేవలు