Ship Floating in Sky: నీటిలో ఉండాల్సిన ఓడ గాల్లో ఎగురుతుందేంటి..? షాక్ అవుతున్న జనాలు..!

Ship Floating in Sky: వేసవి కాలంలో రోడ్డుపై దూరంగా ఉండి చూస్తే మనకు నీళ్లు ఉన్నట్లు కనిపిస్తాయి. దగ్గరికెళితే అలాంటిదేం ఉండదు.

Ship Floating in Sky: నీటిలో ఉండాల్సిన ఓడ గాల్లో ఎగురుతుందేంటి..? షాక్ అవుతున్న జనాలు..!
Follow us

|

Updated on: Mar 06, 2021 | 10:39 PM

Ship Floating in Sky: వేసవి కాలంలో రోడ్డుపై దూరంగా ఉండి చూస్తే మనకు నీళ్లు ఉన్నట్లు కనిపిస్తాయి. దగ్గరికెళితే అలాంటిదేం ఉండదు. రోడ్డుపై నీళ్లు ఉన్నట్లు కనిపించడానికి కారణం ఎండమావి. అచ్చం అలాంటి ఘటన స్కాట్లాండ్‌లో వెలుగు చూసింది. అయితే ఇక్కడ కనిపించింది ఎండమావి కాదు. విచిత్రంగా సముద్రంలో ఉండాలని నౌక.. అటు సముద్రంపై తేలియాడుతూ మబ్బుల్లో ప్రయాణిస్తున్నట్లు కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది. అసలక్కడ ఏం జరుగుతోందని అందరూ కాసేపు బుర్ర గోక్కునేలా చేసింది.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఆకాశంలో నౌక ఎగురుతున్నట్లుగా కనిపించే ఒక భ్రమ లాంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కాట్లాండ్‌ కు చెందిన కోలిన్ మెక్కల్లమ్.. బీచ్ పక్కన ఉన్న రోడ్డుపై ప్రయాణిస్తున్నాడు. ఆ సందర్భంగా గాలిలో తేలియాడుతున్న ఓడను చూసి షాక్‌కు గురయ్యాడు. అంతే వెంటనే దానిని తన ఫోన్‌లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో నౌక నీటికి కొంత ఎత్తున తేలుతున్నట్లు కనిపిస్తుంది. అలా కనిపించడానికి ఆకాశం, సముద్రం సారూప్య రంగే కారణం అని చెబుతున్నారు. ఆ కారణంగానే ఓడ మేఘాలపై కూర్చున్నట్లుగా కనిపిస్తుందన్నారు.

ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సదరు వ్యక్తి.. ‘‘ఈ రోజు నిజ జీవిత ఆప్టికల్ భ్రమను చూశాను. నేను పడవను మొదటిసారి చూసినప్పుడు. ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించాను. చూడటానికి అది మేఘాల్లో తేలుతున్నట్లుగా ఉంది. కానీ నిశితంగా పరిశీలించాక గానీ అర్థం అయ్యింది. తీరానికి దగ్గరగా ఒక మేఘం ఏర్పడటం వల్ల ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఇది నీటి రంగును భూమికి దగ్గరగా మార్చింది. పడవ సుదూరంలో ఉండటం.. మేఘాల ఎఫెక్ట్.. మొత్తంగా ఆ ఓడ తేలియాడుతున్నట్లు కనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఫోటోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అసలేం జరుగుతోంది అక్కడ అంటూ ప్రశ్నించారు.

Flying Ship..:

Saw a real life optical illusion in Banff today ?

Posted by Colin McCallum on Friday, 26 February 2021

Also read:

International Women’s Day 2021: విదేశాల్లోని చట్టసభల్లో సత్తా చాటిన భారత నారీమణులు వీళ్ళే..

AP Municipal Elections : ఏపీలో రెండు రోజులే టైమ్‌.. పీక్స్‌కు ప్రలోభాలు, చీప్‌లిక్కర్‌ నుంచి ఫేక్‌ కరెన్సీదాకా ఓట్లకు గాలం