AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Women’s Day 2021: విదేశాల్లోని చట్టసభల్లో సత్తా చాటిన భారత నారీమణులు వీళ్ళే..

ఆమె.. సృష్టికి మూలం .. గుడులు కట్టి ఆరాధిస్తాం.. కానీ, ఆడిపిల్ల తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం..వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా, తల్లిగా, ఉద్యోగిగా,

International Women’s Day 2021: విదేశాల్లోని చట్టసభల్లో సత్తా చాటిన భారత నారీమణులు వీళ్ళే..
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2021 | 10:28 PM

Share

ఆమె.. సృష్టికి మూలం .. గుడులు కట్టి ఆరాధిస్తాం.. కానీ, ఆడిపిల్ల తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం..వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా, తల్లిగా, ఉద్యోగిగా, ప్రజా ప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పనిచేస్తున్నారు. వెనుకబడిన దేశాల్లోనే కాదు, అగ్రరాజ్యాలుగా దూసుకెళ్తున్న సమాజాల్లోనూ చాలా వరకూ మహిళలకు అవకాశాలు తక్కవే..అందుకే వాటిని అందిపుచ్చుకుని, ఆంక్షలను బద్దలు కొట్టడానికి ఆమె సమరశంఖం పూరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భవించింది. అతివలను చైతన్యపరిచి, వారిలోని ప్రతిభను చాటే ఓ చారిత్రక ఘట్టానికి పునాదిగా మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం దేశ చట్టసభల్లోనే కాకుండా.. విదేశీ చట్ట సభల్లోనూ తమ సత్తాను చూపిస్తున్నారు. ఇటీవలే అగ్రరాజ్యం ఎన్నికలల్లో భారత సంతతి మహిళలు గెలుపొంది. ఉపాధ్యాక్ష పదవిని చేపట్టే వరకు వారి పయానం కోనసాగింది.

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు విజయాలు సాధించి, తమ ప్రాబల్యాన్ని నిరూపించుకున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వివిధ పదవులకు జరిగిన ఎన్నికల్లో తమ సత్తా చాటారు. యుద్ధభూమిలాంటి కీలక రాష్ట్రాల్లో ఇండియన్‌-అమెరికన్‌ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండడం, ఈ ఎన్నికల్లో వారు ప్రభావాన్ని చూపడం విశేషం. అమెరికా ప్రతినిధుల సభకు నలుగురు ఎన్నిక కాగా, వివిధ రాష్ట్రాల్లోని ప్రతినిధుల సభలకు, సెనేట్‌కు 12 మంది నెగ్గారు. వీరిలో అయిదుగురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది ఇండియన్‌-అమెరికన్‌ ఓటర్లు ఉండగా, అందులో కీలక రాష్ట్రాలైన ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, మిషిగన్‌లలో 5 లక్షల మంది వరకు ఉన్నారు. ప్రతినిధుల సభకు నలుగురు ఇండియన్‌-అమెరికన్లు మరోసారి గెలిచి రికార్డు సృష్టించారు. వీరంతా డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థులే. అత్యంత సీనియర్‌ అయిన డాక్టర్‌ అమీ బేరా కాలిఫోర్నియో నుంచి వరుసగా అయిదో సారి ఎన్నికయ్యారు. ప్రమీలా జయపాల్‌ (వాషింగ్టన్‌), రాజా కృష్ణమూర్తి (ఇల్లినాయిస్‌), రో ఖన్నా (కాలిఫోర్నియా) వరుసగా మూడోసారి గెలుపొందారు. డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున ఏడుగురు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులుగా ముగ్గురు పోటీ చేశారు. సెనేట్‌కు ఇరు పార్టీల తరఫున ఒక్కొక్కరు రంగంలో నిలిచారు.

రాష్ట్ర స్థాయిలో 12 మంది..

వివిధ రాష్ట్రాల ప్రతినిధుల సభ, సెనేట్‌, ఇతర పదవులకు 12 మంది భారత సంతతి నేతలు విజయం సాధించారు. మరో ఇద్దరు ఆధిక్యం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. * కేశా రామ్‌- వెర్‌మౌంట్‌ రాష్ట్ర సెనేట్‌ * నిఖిల్‌ సావల్‌- పెన్సిల్వేనియా రాష్ట్ర ప్రతినిధుల సభ * జెనిఫర్‌ రాజ్‌కుమార్‌- న్యూయార్క్‌ రాష్ట్ర ప్రతినిధుల సభ * ఆశా కర్లా- కాలిఫోర్నియా రాష్ట్ర ప్రతినిధుల సభ * జై చౌధురి – ఉత్తర కరోలినా రాష్ట్ర సెనేట్‌ * నీరజ్‌ అంటానీ- ఒహాయో రాష్ట్ర సెనేట్‌ * పద్మ కుప్ప- మిషిగన్‌ రాష్ట్ర ప్రతినిధుల సభ * నిమా కులకర్ణి- కెంటకీ రాష్ట్ర ప్రతినిధుల సభ * జెరెమీ కూనే- న్యూయార్క్‌ రాష్ట్ర సెనేట్‌ * వందన స్లాట్టర్‌- వాషింగ్టన్‌ రాష్ట్ర ప్రతినిధుల సభ * అమిష్‌ షా – అరిజోనా రాష్ట్ర ప్రతినిధుల సభ * రవి శాండిల్‌- టెక్సాస్‌ జిల్లా జడ్జి

Also Read:

International Women’s Day 2021: అరుదైన రికార్డు సృష్టించిన మహిళలు.. ఆకాశంలో 16 వేల కిలోమీటర్లు పయనం..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ