Temple in Nizamabad : నిజమాబాద్ నగరంలో వింత ఆచారం.. బ్రహ్మపురి కాలనీలో ఇంటింటికీ ఓ ఆలయం.. ఎందుకు ఇలా అంటే.. ?
Temple in Nizamabad : సాధారణంగా ఎవరింటికైనా వెళ్లేముందు పండ్లు, మిఠాయిలు తీసుకుని వెళ్తాం. కానీ నిజామాబాద్‌లోని ఓ కాలనీలో
Temple in Nizamabad : సాధారణంగా ఎవరింటికైనా వెళ్లేముందు పండ్లు, మిఠాయిలు తీసుకుని వెళ్తాం. కానీ నిజామాబాద్‌లోని ఓ కాలనీలో మాత్రం ఏ ఇంటికి వెళ్లాలన్నా సరే.. కొబ్బరికాయలు, పూలు, నైవేద్యాలు తీసుకుని వెళ్తుంటారు. ఎందుకంటే.. అక్కడి బ్రహ్మపురి కాలనీలో ఉన్న ప్రతీ ఇల్లు ఓ దేవాలయమే! సాధారణంగా ఈ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా టీవీల శబ్ధమే వినిపిస్తుంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఇంట్లోనూ మంత్రోచ్ఛరణలు, హారతుల పాటలే వినిపిస్తుంటాయి.
నిజామాబాద్ నగరంలోని బ్రహ్మపురి కాలనీకి వందల ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వం బ్రాహ్మణులు తమ ఇంట్లోనే దేవాలయాన్ని నిర్మించుకొని, నిత్యం దైవసేవలో ఉండేవారు. ఆ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తుండగా..ఇక్కడున్న దాదాపు 200 ఇళ్లు దేవాలయాలతోనే దర్శనమిస్తున్నాయి. ఇలా వారసత్వంగా వచ్చిన ఆచారాలను నేటికీ కొనసాగిస్తూ, దేవతామూర్తులకు గుడిలో నిత్యం జరిగే అన్ని పూజలను ఇంట్లోనే చేసుకుంటున్నారు. ఇందుకోసం ఇంటికి ఆనుకునే చిన్న చిన్న ఆలయాలను నిర్మించి, వీధుల్లో పెద్ద ఆలయాలు నిర్మించడం విశేషం.
ఒకప్పుడు మరాఠాలు ఏలిన ప్రాంతం కావడంతో ఇక్కడ ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రభావం కూడా ఎక్కువే. అందుకే ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయాలు వంద వరకు ఉన్నాయి. ఇలా ఇళ్లలో ఆలయాలు నిర్మించడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఇక ఇప్పుడు శివరాత్రి పర్వదినం వస్తుండటంతో కాలనీ మొత్తం పూజలు, పురస్కారాలతో సందడిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారి వారి ఆలయాల్లో ఘనంగా అభిషేకాలు నిర్వహిస్తారు. నిష్టతో జాగారం చేస్తారు. ఆధునిక కాలంలో కూడా వారసత్వంగా వచ్చిన ఆచారాన్ని వదిలిపెట్టకుండా ఈ కాలనీ వాళ్లు ఈ పద్దతిని పాటిస్తున్నారు. అంతేకాకుండా హిందూ సంప్రదాయాలను కాపాడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
kangana counter : నువ్వు రేపిస్టుల ఫెమినిస్ట్‌వి.. ఎప్పటికి చీప్ ఆర్టిస్టువే.. తాప్సీపై విరుచుకుపడిన కంగనా.. Ashwin Breaks Records : రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. దిగ్గజాల సరసన చోటు..