AP Municipal Elections : ఏపీలో రెండు రోజులే టైమ్.. పీక్స్‌కు ప్రలోభాలు, చీప్‌లిక్కర్ నుంచి ఫేక్ కరెన్సీదాకా ఓట్లకు గాలం
AP Municipal Elections : కర్నూలుజిల్లా ఆదోని పట్టణ శివారులోని ఎమ్మిగనూరు బైపాస్ దగ్గర లెక్కచూపని నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..
AP Municipal Elections : కర్నూలుజిల్లా ఆదోని పట్టణ శివారులోని ఎమ్మిగనూరు బైపాస్ దగ్గర లెక్కచూపని నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా కారులో ఉన్న 10 లక్షలు సీజ్ చేశారు, బెంగళూరుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆదోనినే కాదు మున్సిపోల్స్ నేపథ్యంలో ఏపీలో అక్కడక్కడా డబ్బు దొరుకుతూనే ఉంది. కర్నూలు పంచలింగాల చెక్‌పోస్టులో 73 లక్షల వరకు దొరికాయి. విశాఖ గాజువాకలో ఎలాంటి రశీదులు లేకుండా తీసుకెళ్తున్న 25 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈమధ్య విశాఖలో ఏకంగా 8కోట్ల డబ్బు…అది కూడా ఫేక్ కరెన్సీ దొరికింది. అక్షరాలా 7 కోట్ల రూపాయల 90లక్షలు. అన్నీ పెళపెళలాడే 5వందల నోట్లు. ఏ బ్యాంక్‌కు చెందిన సొమ్మోకాదు. మాయచేసి మార్కెట్లోకి తెస్తే తప్ప చెల్లని ఫేక్ నోట్లు.
ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లోని కోరాపుట్ జిల్లా పొట్టంగిలో ఈ దొంగనోట్లను పట్టుకున్నారు పోలీసులు. 1580 కట్టలుకట్టి నాలుగు బ్యాగుల్లో పెట్టి ఓ కారులో తరలిస్తుండగా చెకింగ్‌లో దొరికిన ఈ ఫేక్ కరెన్సీ ఆంధ్రాకు తరలుతుండటంతో…ఎన్నికల కోసమే అన్న డౌటొచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాయపూర్ నుంచి విశాఖకు ఫేక్ కరెన్సీ తరలించబోయిన ముగ్గురు వ్యక్తులను కారుతో పాటు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలుజిల్లా ఆదోనిలో కంకర్ ట్రాకర్టర్‌లో కర్నాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కర్నాటక-ఆంధ్ర సరిహద్దులో నిర్వహించిన తనిఖీల్లో గజ్జెహళ్లి క్రాస్ దగ్గర 96 బాక్సుల్లో 9వేల 216 టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3లక్షల 27వేల విలువ ఉంటుందని అంచనావేశారు.