AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CRPF Constable: విశాఖ జిల్లాలో విషాదం.. సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి… కారణం ఏంటంటే..

CRPF Constable: విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. కొత్త పాడేలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందింది. పంటి నొప్పిని తట్టుకోలేక స్పృహతప్పి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలై ప్రాణాలు ..

CRPF Constable: విశాఖ జిల్లాలో విషాదం.. సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి... కారణం ఏంటంటే..
Chunduru SI Sravani died
Subhash Goud
|

Updated on: Mar 07, 2021 | 1:43 AM

Share

CRPF Constable: విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. కొత్త పాడేలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందింది. పంటి నొప్పిని తట్టుకోలేక స్పృహతప్పి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త పాడేరు గ్రామానికి చెందిన గంగపూజారి మౌనిక ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సెలవులకు స్వగ్రామానికి వచ్చిన ఆమె.. తన కూతురి పుట్టిన రోజు అనంతరం విధుల్లో చేరాలని భావించారు. అయితే ఈ క్రమంలో గత నెల తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె తిరిగి విధుల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పంటి నొప్పితో ఢిల్లీకి వెళ్లలేకపోయారు.

వారం రోజులుగా నొప్పి తీవ్రతరం కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. రోజువారి పనుల్లో భాగంగా శనివారం బట్టలు ఉతికేందుకు దగ్గరలోని బావి వద్దకు వెళ్లింది. అక్కడ పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, పంటి నొప్పి ఎక్కువ కావడంతో రహదారిపై నడుస్తూనే స్పృహ తప్పిపడిపోయారు. దీంతో ఆమె తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

ఇవీ చదవండి :

ఏపీ అధికార పార్టీలో అలజడి రేపుతున్న నాన్‌బెయిలబుల్‌ వారెంట్స్‌.. ఇంతకీ ఆ మంత్రి, ఎమ్మెల్యే చేసిన తప్పేంటి..?

ప్రతి రోజు గుర్రంపై కార్యాలయానికి వస్తాను.. అనుమతి ఇవ్వండి.. కలెక్టర్‌ను కోరిన ప్రభుత్వ ఉద్యోగి

Mukesh Ambani: అంబానీ గ్యారేజ్‌లో కొత్త కారు.. 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలోనే అందుకుంటుంది.. ధర ఎంతంటే..!

రాజస్థాన్‌లో మరో దారుణం.. ఆత్యాచార బాధితురాలి ఇంటికి నిప్పు.. తీవ్రగాయాలతో మహిళ మృతి..!