ప్రతి రోజు గుర్రంపై కార్యాలయానికి వస్తాను.. అనుమతి ఇవ్వండి.. కలెక్టర్‌ను కోరిన ప్రభుత్వ ఉద్యోగి

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మహారాష్ట్ర జనాలకు తీవ్రమైన భయం పట్టుకుంది. కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గినట్లు తగ్గి మళ్లీ విజృంభిస్తుండటంతో మరింత ఆందోళన ..

ప్రతి రోజు గుర్రంపై కార్యాలయానికి వస్తాను.. అనుమతి ఇవ్వండి.. కలెక్టర్‌ను కోరిన ప్రభుత్వ ఉద్యోగి
Follow us

|

Updated on: Mar 07, 2021 | 1:24 AM

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మహారాష్ట్ర జనాలకు తీవ్రమైన భయం పట్టుకుంది. కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గినట్లు తగ్గి మళ్లీ విజృంభిస్తుండటంతో మరింత ఆందోళన నెలకొంది. మహారాష్ట్రలో ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న రాష్ట్ర మహారాష్ట్ర. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో కొందరు ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తుంటే.. మరి కొందరు వాహనాల్లో, రైళ్లల్లో వస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఎక్కడ కరోనా, స్ట్రెయిన్‌ వైరస్‌ సోకుతుందేమోనన్న చాలా మందిలో భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓ ఉద్యోగి వింత అనుమతిని కోరాడు. తాను పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టులో కార్యాలయానికి రావాలంటే భయం వేస్తోందని, ప్రభుత్వం అనుమతి ఇస్తే రోజూ గుర్రంపై ఆఫీస్‌కు వెళ్లి వస్తానని చెప్పాడు.

ఇలా ప్రభుత్వ ఉద్యోగి కార్యాలయానికి గుర్రంపై రావడమనే సంస్ఖృతి దేశంలో ఎక్కడా లేదు. అందువల్ల అనుమతి ఇవ్వడం కష్టమని అధికారులు చెబుతున్నారు. ఇక విషయం ఏంటంటే కార్యాలయంకు గుర్రంపై వస్తే దానిని ఎక్కడ ఉంచాలి. దాని బాగోగులు ఎవరు చూస్తారు.. దాన్ని ఎవరైనా ఎత్తుకుపోతే ఏంటి పరిస్థితి, ఇది ఎవరికైనా హాని కలిగిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇంతకి ఉద్యోగి ఎవరు..?

ఈ వింత కోరిక కోరిన ఉద్యోగి పేరు సతీష్‌ పంజాబ్‌. నాందేడ్‌ కలెక్టరేట్‌లో గ్యారెంటీ స్కీమ్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తనకు గుర్రంపై కార్యాలయానికి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చాడు. అయితే దీనికి ఎలా స్పందించాలో కలెక్టర్‌కు ఏ మాత్రం అర్థం కాలేదు.

అసలు గుర్రం గోల ఎందుకు.. కారు, బైక్‌ ఇలా దేనిపైనా అయినా రావచ్చు కదా కొందరు అంటుంటే.. దీనికి సతీష్ కొత్త సమాధానం చెప్పాడు. తాను బైక్‌పై కార్యాలయానికి వస్తే గతుకుల రోడ్ల వల్ల తన నడుం విరిగిపోతోందని, ఒళ్లు నొప్పులు ఎక్కువై పోతున్నాయి. రకరకాల సమస్యలు వస్తున్నాయని, పోనీ కారు కొనుక్కుందామంటే అంత స్థోమత తనకు లేదు అని అన్నారు. అందుకే అనుమతి ఇస్తే తాను గుర్రం కొనుక్కుని రోజు గుర్రంపై ఆఫీసుకు వస్తానని విన్నవించాడు. తాజాగా ఈ అంశంపై మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై కొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు. గుర్రంపై వస్తే పెట్రోల్‌ ఖర్చు ఉండదు. కాలుష్యం ఉండదు అంటున్నారు.

ఇవీ చదవండి :

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

Food Wastage: ప్రపంచవ్యాప్తంగా 93 కోట్ల టన్నుల ఆహారం వృధా.. మనదేశంలో ఎంత వృధానో తెలిస్తే షాకే!

Mukesh Ambani: అంబానీ గ్యారేజ్‌లో కొత్త కారు.. 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలోనే అందుకుంటుంది.. ధర ఎంతంటే..!

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్