వైద్యుల నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి బలి.. ఆపరేషన్‌ చేసి కుట్లు వేయకుండానే డిశ్చార్జ్‌.. కారణం ఏంటో తెలిస్తే..

రోగి ప్రాణాలు నిలిపే వైద్యులు నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుంది.. ఇంకేముందు ప్రాణాలు కోల్పోవాల్సిందే. అలాంటిదే వైద్యుల క్రూరత్వానికి ఓ చిన్నారి బలైంది. విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ...

వైద్యుల నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి బలి.. ఆపరేషన్‌ చేసి కుట్లు వేయకుండానే డిశ్చార్జ్‌.. కారణం ఏంటో తెలిస్తే..
Follow us
Subhash Goud

|

Updated on: Mar 07, 2021 | 2:36 AM

రోగి ప్రాణాలు నిలిపే వైద్యులు నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుంది.. ఇంకేముందు ప్రాణాలు కోల్పోవాల్సిందే. అలాంటిదే వైద్యుల క్రూరత్వానికి ఓ చిన్నారి బలైంది. విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంభి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కౌశాంభి జిల్లా మన్‌ఝాన్‌పూర్‌ పట్టణానికి చెందిన మూడు సంవత్సరాల ఓ చిన్నారి గత కొన్ని రోజుల కిందట కడుపులో నొప్పి రావడంతో ప్రయాగ్‌ రాజ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు చిన్నారి కుటుంబ సభ్యులు. అయితే వైద్యులు చిన్నారికి సర్జరీ చేసిన తర్వాత ఆస్పత్రి బిల్లులు పూర్తిగా చెల్లించలేదనే కారణంగా చిన్నారికి కుట్లు వేయకుండానే చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ప్రాణాలు కోల్పోయింది. అయితే పాపకు కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించగా, ఫిబ్రవరి 24న పాపకు ఆపరేషన్‌ నిర్వహించారు. ముందుగా ఆపరేషన్‌ ఖర్చు రూ. 5 లక్షలు అవుతాయని వైద్యులు తెలుపగా, అందుకు బాధిత కుటుంబ సభ్యులు రూ.2 లక్షల ముందుగానే చెల్లించారు. పరిస్థితి బాగా లేనందున మిగతా మొత్తం తర్వాత చెల్లిస్తామని కుటుంబ సభ్యులు వైద్యులకు వివరించారు. ఇక డబ్బులు చెల్లించలేదని సరిగా కుట్లు వేయకుండానే పాపను డిశ్చార్జ్‌ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక డిశ్చార్జ్‌ చేసిన అనంతరం ఈనెల 5వ తేదీన మరణించింది. దీంతో పాప కుటుంబ సభ్యులు కౌశాంభి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైద్యులపై శనివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. విచారణ జరిపి వైద్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

అయితే ఆస్పత్రి బిల్లులు మొత్తం చెల్లించలేదనే కారణంతో సర్జరీ చేసిన చోట కుట్లు వేయకుండానే పాపను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో పాప మరణించింది. ఓ వ్యక్తి ఇందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చి వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన వైద్యాధికారులు నిర్లక్ష్యం వహించిన వైద్యులపై దర్యాప్తునకు ఆదేశించారు. పూర్తిగా దర్యాప్తు జరిపిన తర్వాత చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పాప చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, ఇలాంటి వైద్యులు కూడా ఉంటారా..? అనే సందేహం రాకమానదు. వైద్యులు అంటే దేవునితో సమానం భావిస్తారు ప్రజలు. పోయే ప్రాణాలు నిలబెట్టేది వైద్యులు. అలాంటిది నిర్లక్ష్యం కారణంగా చిన్నారి ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. వైద్యుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వైద్యుల నిర్లక్ష్యానికి పాప బలికావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవీ చదవండి :

Beetroot Juice Benefits: రోజూ పరగడుపునే బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే ఏమవుతుంది..? గర్భిణీలు తాగొచ్చా..?

అనారోగ్య సమస్యలను దూరం చేసే వెల్లుల్లి పచ్చడి..ఇలా చేస్తే క్షణాల్లోనే రుచికరంగా.. మీరు ట్రై చేసేయ్యండి..