Beetroot Juice Benefits: రోజూ పరగడుపునే బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే ఏమవుతుంది..? గర్భిణీలు తాగొచ్చా..?

Beetroot Juice Benefits: చాలా మందికి బీట్‌రూట్‌ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. దానిని పచ్చిగా తినేందుకు, జ్యూస్‌ తాగేందుకు వెనుకడుగు వేస్తారు. కానీ బీట్‌రూట్‌ వల్ల ...

Beetroot Juice Benefits: రోజూ పరగడుపునే బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే ఏమవుతుంది..? గర్భిణీలు తాగొచ్చా..?
Follow us
Subhash Goud

|

Updated on: Mar 04, 2021 | 11:03 PM

Beetroot Juice Benefits: చాలా మందికి బీట్‌రూట్‌ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. దానిని పచ్చిగా తినేందుకు, జ్యూస్‌ తాగేందుకు వెనుకడుగు వేస్తారు. కానీ బీట్‌రూట్‌ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్‌రూట్‌ గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా తినకుండా ఉండలేరు. అయితే బీట్‌రూమ్‌ను తినడం ఇష్టం లేని వారు, కనీసం దాని జ్యూస్‌ను ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బీట్‌ రూట్‌ జ్యూస్‌ వల్ల రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీని వల్ల రక్తం త్వరగా తయారయ్యేందుకు ఉపయోగపడుతుంది. రక్తహీనత సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఇక రోజంతా నీరసంగా ఉండేవారు ఉదయం సమయంలో బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా ఎంతో శక్తి అందుతుంది. అంతేకాదు బీట్‌రూట్‌ వల్ల చురుకుగా ఉంటారు. ఏ పని చేయాలన్నా చేయాలని ఉత్సాహంగా ఉంటారు.

అలాగే హైబీపీ ఉన్నవారికి బీట్‌రూట్‌ మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. బీట్‌రూట్‌లో ఉండే పొటాషియం హైబీపీని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇక కొలెస్టాల్‌ అధికంగా ఉన్నవారు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ జ్యూస్‌ తాగడం వల్ల శరీరంలో ఉండే కొలెస్టాల్‌ కరిగిపోతుంది. అంతేకాదు జ్యూస్‌ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు.

గర్భిణులకు..

కాగా, ఈ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల గర్భిణులకు ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల వారి కడుపులో ఉండే బిడ్డకు ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా అందుతుంది. దీంతో కడుపులో పెరిగే బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక లివర్‌ సమస్యలు ఉన్న వారు ప్రతి రోజు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం ఎంతో మంచిది. బీట్‌ రూట్‌ వల్ల లివర్‌ శుభ్రం అవుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది.

నిత్యం బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఐరన్‌ తక్కువగా ఉన్న వారు రక్తహీనతకు గురవుతారు. ఈ బీట్‌రూట్‌ వల్ల ఐరన్‌ పెరుగుతుంది. బ్లడ్‌లో హిమోగ్లోబిన్‌ స్థాయి కూడా పెరుగుతుంది. ఎంతో మంది నీరసంతో ఇబ్బందులకు గురవుతారు. అలాంటి వారు కొన్ని బీట్‌రూట్‌ ముక్కలు తిన్నా .. లేదంటే జ్యూస్‌ తాగినా మంచి ఉపయోగం ఉంటుంది. నీరసం పోయి ఎనర్జీ వస్తుంది.

బీట్‌రూట్‌లో శరీరానికి కావాల్సిన చాలా విటమిన్స్‌ ఉంటాయి. బీ,సీ విటమిన్స్‌ అందుతాయి. బీట్ రూట్‌లో కాల్షియంతో పాటు మెగ్నిషియం కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. కాలేయం శుభ్రం కావడానికి బీట్‌రూట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు కూడా రాకుండా కాపాడుతుంది. ఎముకల్ని గట్టిగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్‌కు ఉంటుంది.

ఇవీ చదవండి :

Helath Benefits of Apple Tea : యాపిల్ తొక్కలతో కూడా టీ చేసుకోవచ్చు.. ఈ టీ తాగితే అమ్మాయి చర్మ మెరవడం ఖాయం..

Dark Chocolate : చాకొలెట్ తింటే గ్లామర్ పెరుగుతుందా..! డార్క్ చాకొలెట్‌ను ఎందుకు ఎక్కువగా తింటారు.. రియల్ ప్యాక్ట్స్ మీ కోసం..