కొవిడ్ వ్యాక్సినేషన్‌లో‌ రికార్డ్.. ఒకే రోజు మిలియన్ మందికి టీకాలు.. ఇప్పటి వరకు మొత్తం ఎంతమందికి వేశారంటే..

India Vaccinates Over 1-million People: జనవరి 16 న ప్రారంభించిన కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.77 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

  • uppula Raju
  • Publish Date - 10:25 pm, Thu, 4 March 21
కొవిడ్ వ్యాక్సినేషన్‌లో‌ రికార్డ్..  ఒకే రోజు మిలియన్ మందికి టీకాలు.. ఇప్పటి వరకు మొత్తం ఎంతమందికి వేశారంటే..

India Vaccinates Over 1-million People: జనవరి 16 న ప్రారంభించిన కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.77 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఇవాళ ఒక్కరోజే మిలియన్ మంది టీకా తీసుకున్నారు. దీంతో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ రోజు రాత్రి ఏడుగంటల వరకు 10.93 మందికి టీకా ఇచ్చారు. దేశ వ్యాప్తంగా వైద్య సిబ్బంది మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. టీకా డ్రైవ్‌ను మొదటగా ఫ్రంట్‌లైన్ వారియర్స్ నుంచి మొదలు పెట్టారు. కాగా రెండో విడత వ్యాక్సినేషన్ మార్చి 1 నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు మధ్య వారికి టీకాలు ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా కేంద్ర ప్రభుత్వం టీకా వేయడానికి నిబంధనలను సవరించిన సంగతి తెలిసిందే.

సీజీహెచ్ ఎస్ కింద 600 కి పైగా 600 కి పైగా హాస్పిటల్స్, ఆయుష్మా‌న్ పీఎం జే కింద 10 వేలకు పైగా ప్రైవేటు హాస్పిటల్స్ ను కేంద్రం గుర్తించింది. వీటిని కోవిద్ ఇమ్యునైజేషన్ సెంటర్లుగా వ్యవహరించనున్నారు. ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,200 మందికి టీకా వేస్తేన్నారు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ నిర్వహిస్తారని కేంద్రం వెల్లడించింది. ఆరోగ్య, నేషనల్ హెల్త్ అథారిటీ మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్స్ లో ఈ ప్రైవేటు హాస్పిటల్స్ జాబితాను అప్ లోడ్ చేసినట్టు తెలిపింది.

ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ సౌలభ్యం కూడా ఉందని, దీని వల్ల ప్రజలు తాము ఎంచుకున్న సెంటర్లకు లేదా ఆస్పత్రులకు వెళ్ళవచ్చునని వివరించింది. ఇలా ఉండగా 45 ఏళ్ళవారిలో జబ్బులకు గురైనవారు తమ మెడికల్ రిపోర్టులను వెంట తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఇప్పటికే కేంద్రం దేశ వ్యాప్తంగా పలు సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్రాలతో టచ్ లో ఉండాలని, ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు సంబంధించి తమతో సమన్వయము చేసుకోవలసి ఉంటుందని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక దేశాల్లో కొత్తగా 85.51 శాతం కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో మొత్తం 17,407 కొత్త కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 9,855 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళ 2,765 తో, పంజాబ్‌లో 772 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో యుకె, దక్షిణాఫ్రికా మరియు బ్రెజిల్ వేరియంట్లలోని SARS-CoV-2 కేసుల సంఖ్య 242 కు చేరిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

విషాదంగా ముగిసిన అమలాపురం యువకుల కథ.. గోదావరిలో మృతదేహాల గుర్తింపు.. అసలేమైందంటే..?