AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే రన్నింగ్ చేస్తున్నారా ? మరీ ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా ? లేకపోతే సమస్యలు తప్పవు..

Running Benefits: బరువు తగ్గడానికి, రోజంతా ఉత్సహంగా ఉండటానికి చాలా మంది ఉదయాన్నే రన్నింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా రన్నింగ్ చేయడం వలన శరీరానికి

ఉదయాన్నే రన్నింగ్ చేస్తున్నారా ? మరీ ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా ? లేకపోతే సమస్యలు తప్పవు..
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2021 | 9:23 PM

Share

Running Benefits: బరువు తగ్గడానికి, రోజంతా ఉత్సహంగా ఉండటానికి చాలా మంది ఉదయాన్నే రన్నింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా రన్నింగ్ చేయడం వలన శరీరానికి కావాల్సిన శ్రమ దొరకడమే కాకుండా హెల్తీగా, ఉత్సహకంగా ఉంటారు. అయితే రన్నింగ్ చేసేవారు కొన్ని విషయాలు గమనించాల్సి ఉంటుంది. రన్నింగ్ ఎలా చేయాలి.. ఆ సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలెంటీ అనేవి. రన్నింగ్ మొదలు పెట్టిన మొట్ట మొదటి రోజే ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి, అన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి అని లెక్కలు వేసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

చాలా మంది మొదటి రోజే రన్నింగ్ ప్రారంభించమన్న ఉత్సుకతతో ఎక్కువగా పరుగెడుతుంటారు. ఇలా ఎక్కువ చేసేయడం వల్ల బాడీ మీద ఇంపాక్ట్ గట్టిగా పడుతుంది. విశ్రాంతి యొక్క అవసరాన్ని అసలు మర్చిపోకూడదు. సరిగ్గా, వార్మప్, కూల్ డౌన్ లేకపోవడం వల్ల మీ ప్రోగ్రెస్ అనుకున్నట్లుగా జరగదు. అలాగే షూస్ వేసుకున్న వెంటనే రన్నింగ్ చేయకూడదు. కాసేపు మినిమం పది నిమిషాలు ఆగి పరిగెత్తాలి. అదేపనిగా రన్నింగ్ చేయకూడదు. రన్నింగ్ కాసేపు ఆపి.. తరువాత కూల్ డౌన్ అవడానికి కొన్ని యోగా స్ట్రెచెస్ చేయడం అవసరం. నెక్ షోల్డర్ రొటేషన్, జంపింగ్ జాక్స్, స్పాట్ జాగింగ్ వంటివి చేయవచ్చు. చాలామందిలో విటమిన్ డీ, విటమిన్ బీ 12 లోపం ఉంటుంది. నలభై ఏళ్ళు దాటిన వారు బ్లడ్ టెస్ట్స్ ద్వారా ఈ లెవెల్స్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి.

జాగ్రత్తలు..

➺ ముఖ్యంగా రన్నింగ్ చేసేప్పుడు సరైన షూస్ వేసుకోవాలి. ➺ రెగ్యులర్ గా కాకుండా ఒకరోజు సెలవు తీసుకోవాలి. ➺ రన్నింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి స్ట్రెంత్ ట్రెయినింగ్ తీసుకోవాలి. ➺ ఆరోగ్యకరమైన పండ్లు, పదార్థాలు తీసుకోవాలి. ➺ ఎక్కువగా వేగంగా పరిగెత్తకూడదు. ➺ నీళ్లు ఎక్కువగా తాగుతూ రన్నింగ్ చేయకూడదు. ➺ రోజు తర్వాత రోజు స్ట్రెంత్ ట్రెయినింగ్ ప్రాక్టీస్ చేయాలి. ➺ రన్నింగ్ మొదలు పెట్టేవారు వారానికి రెండు మూడు సార్లు ముప్ఫై నిమిషాలతో మొదలు పెట్టాలి. ➺ వాక్-జాగ్ సీక్వెన్స్ ట్రై చేయాలి.

Also Read:

నీటిపై తేలియాడుతున్న అందమైన భవనాలు… చూసేందుకు రెండు కన్నులు సరిపోవు.. ఎక్కడున్నాయో తెలుసా..