AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Namaskar : ఈ యోగాసనానికి 10 నిముషాలు కేటాయిస్తే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, విటమిన్ ‘డి’ లభ్యం

ప్రస్తుతం మనిషి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం అందరి కల.. అయితే ఉద్యోగం చేసే సమయంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇవ్వడానికి రోజూ శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలని...

Surya Namaskar : ఈ యోగాసనానికి 10 నిముషాలు కేటాయిస్తే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, విటమిన్ 'డి' లభ్యం
Surya Kala
|

Updated on: Mar 05, 2021 | 11:36 AM

Share

Surya Namaskar  : ప్రస్తుతం మనిషి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం అందరి కల.. అయితే ఉద్యోగం చేసే సమయంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇవ్వడానికి రోజూ శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలని.. వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే సమయం సరిపోదు అంటూ వ్యాయామానికి ప్రాధ్యాన్యత ఇవ్వకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం.. అయితే ఇటువంటి వారికీ చక్కటి పరిష్కారం సూర్య నమస్కారం. ఈ సూర్య నమస్కారాలు చేయడానికి మీకు రోజుకి పదినిమిషాల కంటే ఎక్కువ పట్టదు. అయితే దీని వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అనేకం..

యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడూ. ఈ శ్లొకాలు వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో ఉన్నాయి. సూర్య నమస్కారాలలో 12 మంత్రాలు ఉన్నాయి. ఓం మిత్రాయ నమ: ఓం రవయే నమః ఓం సూర్యాయ నమః ఓం భానవే నమః ఓం ఖగాయ నమః ఓం పూష్ణే నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం మరీచయే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం సవిత్రే నమః ఓం అర్కాయ నమః ఓం భాస్కరాయ నమః

సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుము సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెన్నెముకని బలంగా తయారు చేస్తుంది. సుఖమయమైన నిద్ర పడుతుంది. మంచి శరీరాకృతి లభిస్తుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ యొక్క పని తీరు బాగుంటుంది. విటమిన్ డీ లెవెల్స్ ని పెంచుతుంది. హార్మొనల ఇమ్‌బాలెన్స్ ని సరి చేస్తుంది.

సూర్యోదయం వేళలో సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చెయ్యాలి. అయితే ఈ ఆసనాన్ని గర్భిణీలు మూడవ నెల తరువాత , పీరియడ్స్ టైం లో చేయకూడదు. ఇక హెర్నియా, బీపీ పేషెంట్స్ చేయరాదు.

Also Read:

సైన్స్‌కు అందని అద్భుతం.. 7వేల చరిత్ర గల ఆలయం.. నందీశ్వరుడు నోటి నుంచి నిరంతరం జలధారలు

కోవిడ్‌ తర్వాత తొలిసారి పెరిగిన ఉద్యోగ నియమకాలు.. ఐటీలో హైదారాబాద్‌ రెండో స్థానం..