AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాదాలు పగుళ్ళతో ఇబ్బందులు పడుతున్నారా ? ఇలా చేస్తే సమస్య నుంచి సులువుగా బయటపడోచ్చు..

చాలా మంది పాదాల పగుళ్ళతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇవి శరీరంలో అధిక వేడి ఉండడం వలన పాదాల పగుళ్లు వస్తుంటాయని అంటూంటారు. చలికాలంలో

పాదాలు పగుళ్ళతో ఇబ్బందులు పడుతున్నారా ? ఇలా చేస్తే సమస్య నుంచి సులువుగా బయటపడోచ్చు..
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2021 | 10:38 PM

Share

చాలా మంది పాదాల పగుళ్ళతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇవి శరీరంలో అధిక వేడి ఉండడం వలన పాదాల పగుళ్లు వస్తుంటాయని అంటూంటారు. చలికాలంలో ఈ సమస్య తక్కువగా ఉన్నా.. వేసవికాలంలో మరింత బాధిస్తుంటాయి. కొంతమందికి పాదాల పగుళ్ళతో రక్తం బయటకు రావడం కూడా జరుగుతుంది. అయితే ఈ పగుళ్ళను నివారించడానికి కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

-వారానికి రెండు రోజులు గోరు వెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి ఆ నీటిలో మీ పాదాలను పది నిమిషాలు ఉంచండి. ఆ తరువాత మృదువుగా డ్రై స్కిన్ ని స్క్రబ్ చేసేయండి. -స్క్రబ్ చేసిన వెంటనే ఏదైనా ఫుట్ క్రీం రాయండి. మీకు మరీ డ్రై స్కిన్ ఉంటే స్పెషలైజ్డ్ క్రీంస్ తీసుకోండి, ఇవి మామూలు వాటి కంటే థిక్ గా ఉంటాయి. అలాగే, రాత్రి నిద్ర కి ముందు ఫుట్ క్రీం అప్లై చేయడం అలవాటు చేసుకోండి. – మసాజ్ వల్ల డ్రై స్కిన్ కి మంచి జరగడమే కాక పాదాల అలసట పూర్తిగా పోతుంది, రిలాక్స్డ్ గా అనిపిస్తుంది, కొబ్బరి నూనె, నెయ్యి, బాదం నూనె, నువ్వుల నూనె వంటి వాటితో మసాజ్ చేస్తే సర్క్యులేషన్ బాగా జరిగి పాదాలు తేమని కోల్పోకుండా ఉంటాయి. – ఇంకా డ్రై హీల్స్ సమస్య తగ్గక పోతే పెట్రోలియం జెల్లీ యూజ్ చేయండి. ఇది పగిలిన పాదాలకి అద్భుతంగా పని చేస్తుంది. శుభ్రం గా ఉన్న పాదాలకి ఇది అప్లై చేసి సాక్స్ తో కవర్ చేయండి. ఇందు వల్ల మాయిశ్చర్ అక్కడే ఉంటుంది.

జాగ్రత్తలు..

* మైల్డ్, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ క్లెన్సర్ వాడండి. * క్లోజ్డ్ హీల్స్ ఉన్న షూస్ వేసుకోండి. * ఎక్కువ సేపు నడవ వలసి వస్తే మధ్య మధ్య లో ఆగి పాదాలకి విశ్రాంతిని ఇస్తూ నడవండి. * ఎక్కువ సేపు ఒకే పొజిషన్ లో నిలబడి ఉండకండి. * ఇంట్లో అయినా సరే ఈ కాలం లో చెప్పులు వేసుకునే ఉండండి, లేదా కనీసం సాక్స్ వేసుకుని నడవండి. * స్నానం తరువాత పాదాలని అద్దినట్లు గా తుడవండి. * బాగా నీరు తాగండి.

Also Read:

ఉదయాన్నే రన్నింగ్ చేస్తున్నారా ? మరీ ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా ? లేకపోతే సమస్యలు తప్పవు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!