AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టుకు ప్యాక్ వేయడం వలన డ్యామేజ్ కాకుండా షైనీగా తయారవుతుందా ?.. హెయిర్ మాస్క్ వలన ప్రయోజానాలెంటంటే..

Hair Mask: వాతావరణం మారినప్పుడు స్కిన్ లాగానే హెయిర్ కూడా మార్పులకి లోనవుతుంది. జుట్టును కాపాడుకునేందుకు మనం ఎక్కువగా రకారకాల షాంపులు

జుట్టుకు ప్యాక్ వేయడం వలన డ్యామేజ్ కాకుండా షైనీగా తయారవుతుందా ?.. హెయిర్ మాస్క్ వలన ప్రయోజానాలెంటంటే..
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2021 | 6:47 PM

Share

Hair Mask: వాతావరణం మారినప్పుడు స్కిన్ లాగానే హెయిర్ కూడా మార్పులకి లోనవుతుంది. జుట్టును కాపాడుకునేందుకు మనం ఎక్కువగా రకారకాల షాంపులు వాడుతుంటాం. కండిషనర్ కూడా అప్లై చేస్తుంటారు. వీటితో పాటు జుట్టును జాగ్రత్తగా ఉంచుకునేందుకు హెయిర్ మాస్క్ కూడా అవసరమే. ప్రస్తుతం పరిస్థితుల్లో దుమ్ము ధూళీ నుంచి జుట్టును కాపాడుకునేందుకు హెయిర్ మాస్కులు తప్పనిసరి. అసలు హెయిర్ మాస్క్ అంటే ఎంటీ.. దానిని ఎందుకు వాడాలి..ఎలాంటి మాస్క్ వాడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ మాస్క్..

హెయిర్ మాస్క్ అంటే ఒకరకంగా డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ వంటిదే. రోజూవాడే కండిషనర్స్ కంటే ఇందులో కాస్తా నరిష్మెంట్ ఉంటుంది. అలాగే ఇందులో అనేక రకాలుంటాయి. హెయిర్ టైప్ బట్టి.. అందుకు సరిపడా హెయిర్ మాస్క్ అందుబాటులో ఉంటాయి.

ఇన్‏గ్రీడియెంట్స్..

సామాన్యంగా హెయిర్ మాస్క్ కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. సులభంగా మీ ఇంట్లో ఉండే పదార్థాలతో హెయిర్ మాస్క్ రెడీ చేయవచ్చు. తేనె, అరటిపండు, ఎగ్స్, బెర్రీస్, పెరుగు, కోకోనట్ మిల్క్, గ్రీన్ టీ వంటివి వాడోచ్చు.

హెయిర్ మాస్క్ వల్ల ఉపయోగాలు..

1) జుట్టుకు డ్యామేజ్ కాకుండా..

జుట్టును అందంగా తీర్చిదిద్దే క్రమంలో రకారకాల స్టైలింగ్ ప్రోడక్ట్స్, హీట్ స్టైలింగ్ టూల్స్ వాడుతుంటారు. రెగ్యూలర్‏గా వీటిని వాడడం వల్ల జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. ఇందుకు నరిషింగ్ హెయిర్ మాస్క్ వేసుకోవడం వలన జుట్టుకు కావాల్సిన తేమ అందుతుంది. అలాగే జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది.

2) రీ హైడ్రేషన్..

ఎన్ని రకాల ఆయిల్స్ వాడినా జుట్టు డ్రైగా మారిపోతుంది. దీని వలన జుట్టు అందంగా కనిపించక పోవడం, రాలిపోవడం జరుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు హెయిర్ మాస్క్ ను వారానికి ఒకటి రెండు సార్లు వేయడం వలన ఈ సమస్యను తగ్గించవచ్చు.

3) షైనీగా అయ్యేందుకు..

జుట్టు షైనీగా మారాలంటే.. వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ వేయడం వలన జుట్టు షైనీగా మారుతుంది.

4) హెన్నా పెట్టిన కూడా..

తెల్ల జుట్టు ఉన్నవారు దానిని నివారించేందుకు రకారకాల హెన్నాలను వాడుతుంటారు. యూత్ వాళ్లు అయితే రంగులు అద్దుతుంటారు. అయితే ఇలాంటి వారు కూడా హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు.

రకాలు ..

మార్కెట్లో ఎన్నో హెయిర్ మాస్కులు డ్రై హెయిర్ కీ, డల్ హెయిర్ కీ ఉన్నాయి.. కానీ పోర్స్‏ని అన్‌క్లాగ్ చేసే హెయిర్ మాస్క్స్ అంతగా తెలియదు. ఇది స్కాల్ప్‏ని అన్‌క్లాగ్ చేసి డీప్ క్లీన్ చేయడం ఫేస్‏ని ఎక్స్ఫోలియేట్ చేయడం అంత ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది, త్వరగా ఆయిలీగా తయారవదు.

ఎలా చేయాలి..

ముందుగా ఒక కప్పులో సగానికి గ్రీన్ టీ తీసుకోవాలి. దానిని వడకట్టి చల్లార్చి పక్కన పెట్టాలి. ఒక పాత్రలో రెండు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల బెటొనైట్ క్లే వేసి.. అందులోనే గ్రీన్ టీ వేసి కలపాలి. దానిని స్కాల్ప్ పై అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే ఫలితం ఉంటుంది. దీనివలన తలలో ఉండే జిడ్డును తొలగించవచ్చు. అలాగే నిర్జీవంగా మారిన జుట్టును స్మూత్ గా షైనీగా మార్చుకోవచ్చు. అలాగే చుండ్రు సమస్య తగ్గుతుంది.

Also Read:

రెగ్యూలర్‏గా యోగా చేస్తున్నారా ? అయితే ఈ సమయంలో చేసేప్పుడు జాగ్రత్తగా.. లేదంటే..

Neck Pain Tips: మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఇలా చేస్తే క్షణాల్లో నొప్పి మాయం..