రెగ్యూలర్గా యోగా చేస్తున్నారా ? అయితే ఈ సమయంలో చేసేప్పుడు జాగ్రత్తగా.. లేదంటే..
రెగ్యూలర్గా యోగా చేయడం వలన రోజాంతా ఉత్సహంగా ఉండడమే కాకుండా... ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఫిట్నెస్ పట్ల శ్రద్ధ చూపే వారు యోగాను
రెగ్యూలర్గా యోగా చేయడం వలన రోజాంతా ఉత్సహంగా ఉండడమే కాకుండా… ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఫిట్నెస్ పట్ల శ్రద్ధ చూపే వారు యోగాను ఎక్కువసార్లు చేస్తుంటారు. అయితే యోగా చేయడం మంచిదే కానీ.. అతిగా…అనవసర సమయాల్లో చేయడం కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేనప్పుడు బ్రేక్ తీసుకోవడం ఉత్తమం. అలాగే అనారోగ్యంగా ఉన్నప్పుడు యోగా సమయంలో మార్పులు చేసుకోవడం మంచిది. ఇక ఎ సమయంలో యోగా చేస్తే మంచిదనే విషయాలను కూడా తెలుసుకోవాలి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలున్నప్పుడు యోగా ఎలా చేయాలనే విషయాన్ని కూడా గమనించాలి. మరీ ఆ విషయాలను తెలుసుకుందాం.
☛ పూర్తిగా ఆరోగ్యంగా లేనప్పుడు కష్టమైన యోగాసనాలు చేయకపోవడం మంచిది. ఇక ఆ సమయంలో కాస్త తక్కువ తినడం వలన మీ జీర్ణక్రియకు విశ్రాంతి దొరుకుతుంది. ఎక్కువగా తినడం వలన జీర్ణక్రియకు పని శాతం ఎక్కవగా కల్పించడం జరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్య కూడా తొందరగా తగ్గే ప్రభావం ఉండదు. ☛ రోజూవారీ వర్క్ అవూట్స్ ను అనారోగ్యంగా ఉన్నప్పుడు చేయకుండా ఉండకూడదు. ఎప్పుడు చేసే వర్క్ అవూట్స్ కాకుండా సులభమైన వర్క్ అవూట్ చేస్తూ… శరీరానికి కాస్తా శ్రమ కల్పించాలి. తేలికపాటి ఎక్సర్సైజెస్ చేయడం మంచిది. వీటి వలన తల నుంచి కాళ్ళ వరకు శరీరానికి వార్మప్ అవుతుంది. అలాగే అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటారు.
☛ అనారోగ్య సమయంలో మీరు రోజూ చేసే వర్క్ అవూట్ సమయాన్ని కుదించకుండా విభజించుకోవడం ఉత్తమం. ఉదాహరణకు నలభై ఐదు నిమిషాల వ్యాయమం చేసే అలవాటు ఉంటే వాటిని పది, పదిహేను నిమిషాలు రెండు, మూడు సార్లు చేయడం మంచిది. వీటి మధ్యలో బాడీకి కాస్తా రెస్ట్ ఇవ్వాలి.
☛ యోగా చేయడం వలన అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. ఉదాహారణకు ఎసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్, అజీర్ణం వంటి పొట్టకి సంబంధించిన సమస్యల లోనూ, కిడ్నీలకి సంబంధించిన సమస్యల లోనూ యోగాలో రికవరీకి హెల్ప్ చేసే రెమెడీస్ ఉన్నాయి.
Also Read:
Neck Pain Tips: మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఇలా చేస్తే క్షణాల్లో నొప్పి మాయం..