బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నారా ? సెలక్ట్ చేసుకోవడం రావట్లేదా ? అయితే ఇలా ట్రై చేయండి..

బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాలని ఉన్నా.. ఏ బ్రాండ్.. ఏలాంటివి తీసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. తెలియని బ్రాండ్ ప్రొడక్ట్స్ తీసుకోని

  • Rajitha Chanti
  • Publish Date - 9:33 pm, Wed, 3 March 21
బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నారా ? సెలక్ట్ చేసుకోవడం రావట్లేదా ? అయితే ఇలా ట్రై చేయండి..

బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాలని ఉన్నా.. ఏ బ్రాండ్.. ఏలాంటివి తీసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. తెలియని బ్రాండ్ ప్రొడక్ట్స్ తీసుకోని ఇబ్బందులు పడిన వారుంటారు. మరికొందరు ఎప్పుడూ వాడే ప్రొడక్ట్స్ మాత్రమే కొంటుంటారు. వేరే బ్రాండ్ ట్రై చేసే సాహసం మాత్రం చేయరు. అయితే మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మీ స్కిన్ గురించి డెర్మటాలజిస్ట్ తో మాట్లాడి ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకుంటే మంచిదో చర్చించడం ఉత్తమం. డైలీ స్కిన్ కేర్ రొటీన్ బిల్డ్ చేసుకోవటానికి అవసరమైన గైడెన్స్ తీసుకోవడం. వాటికి అనుగుణంగా ప్రోడక్ట్స్ తీసుకోవాలి. ఈ ప్రోడక్ట్స్ రెగ్యులర్ స్కిన్ కేర్ ని మాత్రమే కాదు, యాక్నే, పిగ్మెంటేషన్ వంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ని డీల్ చేసే విధంగా కూడా ఉంటున్నాయి. ఏదైనా ప్రోడక్ట్ ఫలితం చూపించడానికి మూడు నాలుగు నెలలు పడుతుంది అనుకుంటే వారు ఆ విషయం కన్స్యూమర్స్ కి క్లియర్ గా చెబుతారు. న్స్యూమర్స్ కాస్మటాలజిస్టులని కన్సల్ట్ చేసి వారి స్కిన్ కి సరిపోయే ప్రోడక్ట్స్ కొనడంలో ఉత్సాహం చూపిస్తున్నారు. మీ వెంట్రుకలకు షాంపూలను మార్చకూడదు. రెగ్యూలర్ గా ఓకే షాంపూను వాడడం ఉత్తమం. ఇక స్కిన్ కు వాడే క్రీంల గురించి ముందుగా డార్మటాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది.  కాటుకని పెట్టుకోవడం కళ్లకి ఆరోగ్యం కూడా. కళ్లలోని దుమ్ముని తీసేయడంలో ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి రెగ్యులర్‌‌గా కాటుకని కూడా వాడండి. ఇలా చేయడం వల్ల మీ కళ్లు ఎంతో కాంతివంతంగా ముందు కంటే అందంగా కనిపిస్తాయి. ఇందులోనూ ఇప్పుడు ప్లం కోల్ వాటర్ ప్రూఫ్, స్మడ్జ్ ప్రూఫ్ కాజల్స్ వస్తున్నాయి. వీటిని ఐ లైనర్‌లా కూడా వాడొచ్చు. వీటిని వాడడం వల్ల చాలా గంటల వరకూ కళ్లు ఎంతో అందంగా ఉంటాయి. ఎన్ని గంటలైనా కాజల్ అస్సలు పోదు.. అలానే నిలిచి ఉంటుంది.మొటిమల బారినపడే మరియు సున్నితమైన చర్మం ఉన్నవారు వారి చర్మ సంరక్షణ ఉత్పత్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా అమ్మాయిలకు పింక్, రెడ్ కలర్స్ బాగుంటాయి. ఈ రెండు కలర్స్ ఎలాంటి పెదవులనైనా అందంగా మారుస్తాయి. కాబట్టి ఈ రెండు లిప్ కలర్స్‌ని తీసుకోండి. ఇందులోనూ క్రీమీ మ్యాట్ లిప్ కలర్స్ తక్షణమే మీ పెదాలను ఎంతో షైనీగా కనిపించేలా చేస్తాయి. వీటిలో ఇప్పుడు మ్యాట్‌ లిప్ కలర్స్ వచ్చేశాయి. ఇవి ఎక్కవ సమయం మీ పెదాలను అంతే అందంగా ఉంచుతాయి. పింక్ కలర్ లిప్ స్టిక్ బ్లష్‌గా పనిచేస్తుంది.

Also Read:

హాలీడే ట్రిప్ కోసం కేరళ వెళ్తున్నారా ? అయితే మీకోసం కేరళలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల వివరాలు..