AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dandruff Cure at Home:చుండ్రు, దురదతో బాధపడుతున్నారా..సమస్యని నివారించే ఇంటి చిట్కాలను తెలుసుకుందాం..!

ఓ వైపు మనం తినే ఆహారం.. మరోవైపు వాతావరణం కాలుష్యం దీని ప్రభావం జట్టుపై ఎక్కువగా పడుతుంది. ఓ వైపు జుట్టు ఊడిపోతుందని బాధపడుతుంటే మరోవైపు చుండ్రు.. దానికి తోడు దురద..

Dandruff Cure at Home:చుండ్రు, దురదతో బాధపడుతున్నారా..సమస్యని నివారించే ఇంటి చిట్కాలను తెలుసుకుందాం..!
Surya Kala
|

Updated on: Mar 03, 2021 | 5:54 PM

Share

Dandruff Cure at Home: ఓ వైపు మనం తినే ఆహారం.. మరోవైపు వాతావరణం కాలుష్యం దీని ప్రభావం జట్టుపై ఎక్కువగా పడుతుంది. ఓ వైపు జుట్టు ఊడిపోతుందని బాధపడుతుంటే మరోవైపు చుండ్రు.. దానికి తోడు దురద.. అని కొంతమంది వాపోతుంటారు. వెంటనే మార్కెట్ లో దొరికే మార్కెట్లో ఉన్న డాండ్రఫ్ ఫ్రీ షాంపూవైపు దృష్టి సారిస్తారు.. అవి వదినా ఫలితం కనిపించట్లేదని ఆందోళన చెందుతుంటారు. అవి ఇవీ వాడే బదులు ఇంట్లోనే దొరికే పదార్థాలతో చుండ్రును తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. చుండ్రును అరికట్టేందుకు ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం..

సహజమైన ఇంటి నివారణ చిట్కాలు :

*వెంట్రుకల కుదుళ్ళలోకి ఇంకేటట్లుగా కొబ్బరి నూనె తలకు రాసినప్పుడు వేళ్ళతో సున్నితంగా మసాజ్‌ చేయాలి.

*వేసవిలో చెమట వల్ల, వానాకాలంలో తల తడవడం వల్ల వెండ్రుకలు అపరిశుభ్రమవుతాయి. వారానికి రెండుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే వెంట్రుకల ఆరోగ్యం బాగుంటుంది.

*వెనిగర్ జుట్టులో చుండ్రును కలిగించే ఫంగస్ మరియు బ్యాక్టీరియాను చంపడానికి కూడా ఇది సహాయపడుతుంది. వెనిగర్ యొక్క ఆమ్ల కంటెంట్ చుండ్రు తీవ్రతను తగ్గించడానికి చాలా ప్రయోజనకరంగా పని చేస్తుంది. డాక్టర్ దీపాలి సలహా ప్రకారం తల స్నానం చేయడం పూర్తయిన తరువాత వెనిగర్ కొద్దిగా చేతిలోకి తీసుకుని వెంట్రుకలకు పట్టించాలి. అనంతరం 5 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది.

*పుదీనా రసం మాడుకి పట్టించి అరగంట తర్వాత తలని శుభ్రపరిస్తే చుండ్రు సమస్య ఉండదు.

*మందార ఆకులు :జుట్టుకు కండిషనర్ మందార ఆకులు, పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి, చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.

*మెంతి ఆకును దంచి పేస్ట్ లా చేసి తలకు రాస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. వెండ్రుకలు నిగనిగలాడతాయి.

*తలలో చుండ్రు ఏర్పడితే తాజా వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటయిన తర్వాత తలస్నానం చేయాలి. ఆ విధంగా తలస్నానం చేస్తే వెంట్రుకల చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.

* గసగసాలు కొద్దిగా తీసుకొని, సన్నని మంట పై వేయించి, కొద్దిగా గోరువెచ్చటి నీటి లో 4 నుండి 5 గంటలు నానబెట్టి ఆ మిశ్రమాన్ని,తలకు పట్టించి, 1 గంట అనంతరం తల స్నానం చేయాలి

* కొద్దిగా వస కొమ్ము పొడిని తీసుకొని, దానికి నీటిని కలిపి జుత్తు కుదుళ్ళకు పట్టించాలి. దీని వల్ల కొద్దిగ మంటగా ఉండవచ్చు. కానీ అద్భుత ఫలితం ఇస్తుంది. 10 నుండి 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.

*తల స్నానానికి వాడే షాంపూలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి తలకు పట్టించి రుద్దుకుంటే చుండ్రు తీవ్రత తగ్గుతుంది. చుండ్రు తాలూకు వచ్చే దురదను కూడా నివారిస్తుంది. *టీ ట్రీ ఆయిల్ టీ ట్రీ ఆయిల్ ఫంగల్ మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఉపయోగపడుతుంది. మీ షాంపూలో ఒకటి లేదా రెండు టీ ట్రీ ఆయిల్ చుక్కలు వేసి షాంపూ చేసుకున్న తరువాత జుట్టుని కడగాలి.

*వెల్లుల్లి యాంటీ ఫంగల్ సహజ ఉత్పత్తిగా వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని మెత్తగా నూరి తలకు పట్టించాలి. దీనికి కొద్దిగా తేనె కూడా జత చేయవచ్చు.

* కలబంద యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కలబంద మొక్క నుండి గుజ్జుని నేరుగా తీసి తలకు పట్టించడం ఉత్తమం. అనంతరం షాంపూతో కడిగేస్తే చుండ్రు తాలూకు చికాకు తొలగిపోతుంది. దీన్ని వారానికి ఒకసారి పెట్టినా మంచిదే. వెంట్రుకలు కూడా స్మూత్‌గా సిల్కీగా మారతాయని డాక్టర్ శిరీష సూచించారు.

చుండ్రు ఒక వైద్య సమస్య, ఇది ప్రపంచవ్యాప్తంగా సగం మంది జనాభా చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. లింగ బేధం, వయస్సు తారతమ్యాలు లేకుండా అందరినీ వేధించే సమస్య. కనుక ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్ధాలతో నివారణకు ప్రయత్నించడం అత్యుత్తమం అని ఆరోగ్య నిపుణులు చెప్పారు.

Also Read:

 టమాటా రైతులకు విజ్ఞప్తి.. రేటు లేకపోతే కోసి ఎండబెట్టండి. ఎండిన టమోటాకి ఎంత డిమాండ్ ఉందో తెలుసా..!

రుచికరమైన మటన్ కోఫ్తా బిర్యానీ తయారీ విధానం