AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Cooking Mutton Kofta Biryani : రుచికరమైన మటన్ కోఫ్తా బిర్యానీ తయారీ విధానం

రోజూ ఒకే రకమైన ఆహారం తినాలంటే ఎవరికైనా కష్టమే.. ఇక పిల్లలు ఉన్న ఇంట్లో అయితే రోజు ఇదేనా నేను తినను అంటారు. అప్పుడు వెంటనే...

Home Cooking Mutton Kofta Biryani : రుచికరమైన మటన్ కోఫ్తా బిర్యానీ తయారీ విధానం
Biryani
Surya Kala
|

Updated on: Mar 03, 2021 | 4:52 PM

Share

Mutton Kofta Biryani : పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. ఆ మాటను నిజం చేస్తూ.. రోజూ ఒకే రకమైన ఆహారం తినాలంటే ఎవరికైనా కష్టమే.. ఇక పిల్లలు ఉన్న ఇంట్లో అయితే రోజు ఇదేనా నేను తినను అంటారు. అప్పుడు వెంటనే మీ దృష్టి రెస్టారెంట్ లో దొరికే ఫుడ్ వైపుకు వెళ్తుంది. కానీ కొంచెం ఇష్టంగా కష్టపడితే.. రెస్టారెంట్ లో దొరికే ఆహారపదార్ధాలను మీరు మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఈరోజు నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన మటన్ కోఫ్తా బిర్యానీ తయారీ ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం..

మటన్ కోఫ్తా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు

రైస్ తయారీకి కావల్సినవి:

బాస్మతి రైస్ – 4 cups కరవే సీడ్స్ – ½ tsp గరం మసాలా : పెప్పర్ కార్న్స్ – 7 లవంగాలు – కొద్దిగా యాలకలు – 5 షాజీర – 1 tsp దాల్చిన చెక్క – 1 inch కుంకుమపువ్వు – చిటికెడు పాలలో నానబెట్టాలి ఉప్పు : రుచికి సరిపడా

కోఫ్తా తయారీకి కావల్సిన పదార్థాలు:

మటన్ ఖీమా – 500 g ఉల్లిపాయ- 1 (paste) గరం మసాలా పౌడర్ – 1 tsp ఉప్పు : రుచికి సరిపడా గసగసాలు – 1 tsp (finely ground) అల్లం పేస్ట్ – 1 tbsp వెల్లుల్లి పేస్ట్ – 1 tbsp ఫ్రెష్ క్రీమ్ – 1 tbsp కారం – 1 tsp కొబ్బరి తురుము – 1 tsp కొత్తిమీర తరుగు – 1 cup (finely chopped) శెనగపిండి(besan) – 1 tbsp నట్ గమ్ పౌడర్ – ½ tsp బ్రెడ్ – 1 slice (soaked in milk)

కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు:

నూనె – ½ a cup పచ్చిమిర్చి – 2 (chopped) ఉల్లిపాయ – 1 (chopped) టమోటోలు – 2 (pureed) అల్లం పేస్ట్ – 1 tbsp వెల్లుల్లి పేస్ట్ – 1 tbsp జీలకర్ర – ½ tsp పసుపు – ¼th tsp పెరుగు – 3 tbsp గరం మసాలా – ½ tsp కారం – 2 tsp ఉప్పు – రుచికి సరిపడా క్విరా వాటర్ – 1 tbsp పుదీనా – 1 cup (chopped) ఎల్లో ఫుడ్ కలర్ – a pinch నట్ గమ్ పౌడర్ – ¼th tsp గ్రీన్ కార్డమ్ పౌడర్ – ¼th tsp

బిర్యానీ రైస్ తయారీ:

ముందుగా బియ్యంను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నీరు మరిగించి …  నీరు మరుగుతుండగా, అందులో గరం మసాలా జోడించాలి. తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యం అందులో వేసి, బియ్యంతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమం కలబెట్టి, ఉడికించుకోవాలి. బియ్యం ¾th, ఉడికిన తర్వాత వాటర్ ను వంపేసి పక్కన పెట్టుకోవాలి.

కోప్తా తయారీ :

కోప్తా కోసం సిద్దంగా ఉంచుకున్న పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ అన్ని ఒక్కసారిగా పొడి చేసుకోవడానికి వీలుకాకపోతే.. రెండు మూడు పదార్థాలు కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న పదార్థాలన్నింటిని బాగా మిక్స్ చేసి రిఫ్రిజరేటర్ లో 30 నుండి 40 నిముషాల వరకూ ఉంచాలి. 40 నిముషాల తర్వాత బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. చిన్న బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేయాలి. పాన్ మొత్తం నూనెను చేతులతో అప్లై చేయాలి. ఇప్పుడు ఫ్రిజ్ లో నుండి తీసిన మీట్ మిశ్రమంను చేత్తో చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. మీట్ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకున్నాక తిరిగి రిఫ్రిజరేటర్ లో పెట్టాలి.

కర్రీ తయారీ :

స్టౌ మీద పాన్ పెట్టి.. వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి ఒక నిముషం వేగించాలి. వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని వేగించుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్సరెంట్‌గా వేగిన తర్వాత అందులో టమోటో పేస్ట్, గ్రీన్ చిల్లీ, పసుపు మరియు ఉప్పు వేసి, మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ ఫ్రై చేయాలి. అసవరమయితే కొద్దిగా వాటర్ మిక్స్ చేసి సాప్ట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు మంట తగ్గించి, ఇందులో రిఫ్రిజరేటర్ లో పెట్టుకున్న కోఫ్తాలతో పాటు చిక్కగా చిలికిన పెరుగును కూడా వేసి మిక్స్ చేసి మూత పెట్టాలి ఈ మొత్తం మిశ్రమాన్ని 20 నిముషాలు నుంచి 30 నిముషాల వరకూ ఉడికించుకోవాలి. అనంతరం అందులోనే నట్ మగ్ పౌడర్, పుదీనా, కొత్తిమీర ఆకులు తరుగు వేసి కలుపుకోవాలి.

బిర్యానీ తయారీ :

డీప్ బాటమ్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి రాసి, రైస్‌ను ఒక లేయర్‌గా సర్ధాలి. తర్వాత కోఫ్తా కర్రీని మరో లేయర్‌గా సర్దాలి. తిరిగి రైస్ లైయర్, కోఫ్తా లేయర్ రెండు మూడు లేయర్స్ గా సర్ధుకోవాలి. ఫైనల్ గా కెవరా వటర్‌ను, పాలలో నానబెట్టిని కుంకుమ పువ్వు, ఎల్లో ఫుడ్ కలర్ ను చిలకరించుకోవాలి. మంట ఎక్కువగా పెట్టి 10 నిముషాలు తర్వాత తక్కువ మంటతో ఆవిరి మీద 10 నిముషాలు ఉడికించుకోవాలి. అంతే మటన్ కోఫ్తా బిర్యానీ రెసిపీ రెడీ. రైతా లేదా గ్రీన్ సలాడ్‌తో రెస్టారెంట్ కు ఏ మాత్రం తగ్గని మటన్ కోఫ్తా బిర్యానీని ఎంజాయ్ చేయొచ్చు.

Also Read:

షర్మిల ఎంట్రీతో తమ పార్టీకే ఎక్కువ నష్టమని గ్రహించిన కాంగ్రెస్‌ నేతలు! షర్మిల వర్గంపై విమర్శలు డోసును పెంచిన రేవంత్‌ వర్గం!

మళ్ళీ ప్రపంచదేశాల్లో కోరలు చేస్తున్న కోవిడ్.. ఆందోళన వ్యక్తంచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ