AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Coronavirus : మళ్ళీ ప్రపంచదేశాల్లో కోరలు చేస్తున్న కోవిడ్.. ఆందోళన వ్యక్తంచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. గత కొంతకాలంగా అనేక దేశాలు వైరస్ నివారణకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. దీంతో త్వరలోనే కోవిడ్ అదుపులోకి వస్తుందని..

World Coronavirus :  మళ్ళీ ప్రపంచదేశాల్లో కోరలు చేస్తున్న కోవిడ్.. ఆందోళన వ్యక్తంచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
Surya Kala
|

Updated on: Mar 03, 2021 | 3:56 PM

Share

World Coronavirus : చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. గత కొంతకాలంగా అనేక దేశాలు వైరస్ నివారణకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. దీంతో త్వరలోనే కోవిడ్ అదుపులోకి వస్తుందని అందరూ భావించారు. అయితే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కోరలు చేస్తుందని గణనీయంగా కేసులు పెరుగుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. నిత్యం పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఏడాది గడిచినా.. కూడా ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాలకు మాత్రం బ్రేక్ పడట్లేదు. గత 24గంటల్లో 1,09,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు 1,15,369,742 దాటాయి. గడచిన 24గంటల్లో ఈ మహమ్మారి కారణం సుమారు 9 వేల మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 25,62,206 కు దాటింది. ఇప్పటివరకు కరోనా నుంచి 9,11,68,305 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 21,639,231 కోట్లకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇండియా , బ్రెజిల్, రష్యా, బ్రిటన్ ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. మొత్తం మరణాల్లో కూడా అమెరికానే అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ కొనసాగుతున్నాయి.

ఇక బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. దీంతో రాజధానిలో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ ఆదివారం అమల్లోకి వచ్చింది. బ్రెజిల్‌లోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. ఇక మరోవైపు మన దేశంలోనూ వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. మొదట్లో కేసులు కొంత మేర తగ్గినప్పటికీ, మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read:

ఐదు నిమిషాలు మరగబెట్టిన గ్రీన్ టీతో అద్భుత ఫలితాలు.. నగరంలో విస్తరిస్తున్న నయా ట్రెండ్

 సుద్దబిళ్లలతో నకిలీ మందులు తయారుచేసి మార్కెట్‌లోకి వదిలారు.. ఏపీలో డ్రగ్ దందా !