1/5

ఈ మధ్య కాలంలో మీరు గ్రీన్ టీ మరియు దాని ఫలితాల గురించి చాలా విని ఉంటారు. గ్రీన్ టీ అంటే ఏమిటి? దీనిలోని రకాలు ఏమిటి? అందరూ గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు, అది నిజమేనా?
2/5

గ్రీన్ టీలో ఉండే పాలీఫినాల్స్, కాన్పర్ కణాలను చంపడం, విస్తరించకుండా ఆపడంలో ప్రధానపాత్ర పోషిస్తాయని పరిశోధకుల అభిప్రాయం.బ్రెస్ట్ క్యాన్సర్ కలిగిన 472 మంది మహిళలపై జరిపిన పరిశోధనలో, గ్రీన్ టీ తరచుగా తీసుకున్న వారిలో క్యాన్సర్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది.
3/5

రోజూ ఒకటో రెండో కప్పుల గ్రీన్ టీ తాగేవారిలో రక్తనాళాలు కుంచించుకుపోవడం 46శాతం తగ్గుతుందని పరిశోధనల్లో బయటపడింది. మూడు కప్పులకు పెంచిన వారికి గుండెపోటు వచ్చే అవకాశం 43 శాతం తగ్గినట్టు, గుండెపోటుతో చనిపోయే అవకాశం 70 శాతం తగ్గిస్తుందని తేలింది.
4/5

గ్రీన్ టీలో కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు తగ్గించుకోవాలంటే రోజూ నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగితే చాలు. ఇందులో పుష్కలంగా ఉండే క్వెర్సెటిన్ అనే రసాయన పదార్థం నొప్పిని తగ్గించే దివ్యౌషధం. పైగా చాలా యాంటాక్సిడెంట్లు కూడా ఉంటాయి. రోజూ గ్రీన్ టీ తాగేవాళ్లకు రుమటాయిడ్ అర్థరైటిస్ వచ్చే అవకాశాలు 60 శాతానికి పైగా తగ్గుతాయని వెస్టరన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం తన పరిశోధనలో తేల్చింది.
5/5

గ్రీన్ టీలో ఉండే యాంటాక్సిడెంట్లు, వృక్ష రసాయనాలకు వాపు, మంటల నుండి ఉపశమనం అందించే లక్షణం ఉంది. రకరకాల అలర్జీల వల్ల బాధపడేవారు, రోజూ గ్రీన్ టీ తాగితే అద్భుత ఫలితాలుంటాయి. ఇది సైనసైటిస్ సమస్యను కూడా దూరం చేస్తుంది.