ESIC Jobs: ఈఎస్‌ఐసీలో 6,552 ఉద్యోగాల భర్తీ.. త్వరలోనే నోటిఫికేషన్.. విద్యార్హతలు ఏంటంటే..
Esic Recruitment 2021: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఏకంగా 6,552 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం సూచన ప్రాయంగా వివరాలు తెలపగా పూర్తి నొటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు..
Updated on: Mar 03, 2021 | 1:36 PM

ఎంప్లాయూస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఏకంగా 6,552 ఉద్యోగాలను భర్తీచేయనుంది.

ప్రస్తుతం సూచన ప్రాయంగా తెలిపిన ఈఎస్‌ఐసీ మార్చి చివరిలో లేదా ఏప్రిల్ నెలలో పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

మొత్తం 6,552 ఖాళీలు ఉండగా.. 6306 అప్పర్ డివిజన్ క్లర్క్/అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్ పోస్టులను, 246 స్టెనోగ్రఫీ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

స్టెనోగ్రఫీ ఉద్యోగాలకు12వ తరగతి లేదా తత్సమాన అర్హతకాగా.. అప్పర్ డివిజన్ క్లర్క్/అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్ - ఏదైనా అర్హత పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేయడంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

ఆసక్తికలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.




