Telugu News Odd News Historical source on the departure of sri krishna devaraya the great emperor death message in tulu language photo story
Sri Krishnadevaraya death date: కృష్ణదేవరాయల మరణతేదీపై వీడిన సందిగ్ధత
Krishnadevaraya : చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పాలకుడు శ్రీ కృష్ణదేవరాయులు మరణంపై ఆది నుంచి అనుమానాలే. ఆయన గతించిన తేదీపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ..
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పాలకుడు శ్రీ కృష్ణదేవరాయులు మరణంపై ఆది నుంచి అనుమానాలే. ఆయన గతించిన తేదీపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తాజాగా కర్నాటకలోని ఓ చారిత్రక శాసనంలో కృష్ణదేవరాయల మరణతేదీపై సందిగ్ధం వీడింది.
1 / 4
కర్ణాటకలోని తుమకూర్ జిల్లాలోని ఒక ఆలయంలో బయటపడ్డ శాసనం. ఈ శాసనం ప్రకారం కృష్ణదేవరాయలు అక్టోబర్ 17,1529న తుదిశ్వాస విడిచారని తేలింది.
2 / 4
ధన్‌పాల్ అనే బస్సు డ్రైవర్ మొదట దీన్ని గుర్తించి పురావస్తు అధికారులకు సమాచారం అందించాడు. దాంతో పరిశోధకులు హొన్నెనహళ్లి గ్రామంలోని గోపాలకృష్ణ ఆలయంలో నల్ల రాతిపై ఈ శాసనాన్ని గుర్తించారు. తుళు భాషలో చెక్కిన ఈ శాసనమే..ఆయన మరణ సందేశం. దీని ద్వారా కృష్ణదేవరాయలు మరణించిన కచ్చితమైన తేదీ బయటకు వచ్చిందని డైరెక్టరేట్ ఆఫ్ ఎపిగ్రఫీ నిపుణులు ప్రకటించారు.
3 / 4
కృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుతా దేవరాయలు 1529 అక్టోబర్ 21న తులువా రాజవంశం నాల్గవ రాజుగా పట్టాభిషక్తుడయ్యాడు. ఇందుకు సంబంధించిన ఓ శాసనం గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తిలో లభ్యమైంది. అయితే అంతకంటే కొద్దిరోజుల ముందే శ్రీకృష్ణదేవరాయలు మరణించి ఉంటారని అంతా భావించారు. కానీ.. కచ్చితమైన తేదీ అప్పుడు లభించలేదు. తాజాగా బయటపడ్డ శానసంలో అన్ని వివరాలు వెలుగుచూశాయి.