హెచ్‌–1బీ వీసాల జారీ తొలగని ఉత్కంఠ.. ఎటూ తేల్చని బైడెన్‌ సర్కార్.. సంస్కరణలు అవసరమంటున్న హోంల్యాండ్‌ సెక్యూరిటీ

అమెరికాలో హెచ్‌–1బీ వీసాల మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంపై బైడెన్‌ సర్కార్‌ ఎటూ తేల్చుకోలేకపోతోంది.

హెచ్‌–1బీ వీసాల జారీ తొలగని ఉత్కంఠ.. ఎటూ తేల్చని బైడెన్‌ సర్కార్.. సంస్కరణలు అవసరమంటున్న హోంల్యాండ్‌ సెక్యూరిటీ
అమెరికా, నార్త్ కొరియా మధ్య విభేదాలు తీవ్ర వైషమ్యాలకు దారి తీస్తున్న వైనం.
Balaraju Goud

|

Mar 03, 2021 | 3:29 PM

Era H-1B Visa Ban : అమెరికాలో హెచ్‌–1బీ వీసాల మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంపై బైడెన్‌ సర్కార్‌ ఎటూ తేల్చుకోలేకపోతోంది. వలస విధానాన్ని సమూలంగా సంస్కరిస్తామని చెబుతూ వస్తున్న బైడెన్‌ ప్రభుత్వం హెచ్‌–1బీ వీసాలపై ఓ నిర్ణయానికి రాలేకపోతుతంది. ఇదే అంశానికి సంబంధించి హోంల్యాండ్‌ సెక్యూరిటీ మంత్రి అలెజాంద్రో మయోర్కస్‌ సూచన ప్రాయంగా వెల్లడించారు. కాగా, భారత్, చైనా వంటి దేశాలకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ఈ వీసాల ద్వారానే టెక్నాలజీ కంపెనీలు వేలాది మందిని ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. భారత్‌కి చెందిన టెక్కీలు హెచ్‌–బీ వీసా కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఈ వీసాలపై నిషేధం ఎత్తేస్తారో లేదో తేల్చుకోకపోవడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన టెకీ కంపెనీల్లో నెలకొంది. కరోనా సంక్షోభం సమయంలో ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉండగా ఈ నెల 31 వరకు హెచ్‌–బీ వీసాలపై నిషేధం విధించారు. అమెరికాలో నిరుద్యోగం అత్యధికంగా ఉండడంతో విదేశీ వర్కర్లకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేమన్న వాదనతో ట్రంప్‌ ఈ నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో హెచ్1బీ కోసం ఆశపడ్డ వేలాది మంది టెకీ ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. అయితే గత ఎన్నికల సమయంలో బైడెన్ వీసాలపై నిషేధం ఎత్తివేస్తామని హెచ్ 1బీ వీసాల జారీ సంస్కరణలు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

ఇందులో భాగంగానే లావుంటే, బైడెన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రంప్‌ వలస విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంస్కరణలు మొదలు పెట్టింది. ముస్లింలపై వీసా ఆంక్షల్ని, కొత్త గ్రీన్‌కార్డుల జారీపై నిషేధాన్ని ఎత్తివేసింది. కానీ, హెచ్‌–1బీలపై ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకోలేదు. బైడెన్‌ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చెయ్యకపోతే మార్చి 31న నిషేధం దానంతట అదే రద్దయిపోతుంది. వైట్‌హౌస్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో గడువు కంటే ముందే నిషేధాన్ని ఎత్తివేస్తారా అని అడిగిన ప్రశ్నకు మయోర్కస్‌ స్పందిస్తూ ‘‘ఇలాంటి ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. వలస విధానాన్ని సంస్కరించడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. దీనికి సమయం పడుతుంది’’అని చెప్పారు. మరోవైపు హెచ్‌–బీ వీసాల దరఖాస్తు స్వీకరణను ఇమిగ్రేషన్‌ విభాగం ప్రారంభించింది. కాగా, ఐటీ నిపుణులు కావాలంటే హెచ్‌–బీ వ్యవస్థని ప్రక్షాళన చేయాలని, వీసాల సంఖ్యను పెంచాలని ఫేస్‌బుక్‌ చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్, గూగుల్‌ సంస్థకి చెందిన సుందర్‌ పిచాయ్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

Read Also…  Cinema Theaters : ప్రభుత్వం స్పందించకపోతే నిరాహరా దీక్షలే అంటోన్న తెలంగాణ థియేటర్ల ఓనర్లు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu