Elon Musk dearMoon project: మీరు కళాకారులా..? అయితే చంద్రుడిపైకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోండి.. జపాన్ బిలియనీర్ బంపరాఫర్..
Fly To Moon: అంతరిక్ష రంగంలో వస్తోన్న సమూల మార్పులు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టడంతో వినూత్న ప్రయోగాలకు నాంది పలుకుతున్నాయి. అనంత విశ్వంలో..
Fly To Moon: అంతరిక్ష రంగంలో వస్తోన్న సమూల మార్పులు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టడంతో వినూత్న ప్రయోగాలకు నాంది పలుకుతున్నాయి. అనంత విశ్వంలో ఉన్న గ్రహాలను మానవుడికి దగ్గరగా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్ ప్రైవేటు వ్యక్తులను చంద్రుడిపైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందడుగు కూడా పడింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ 2023లో జపాన్ బిలియనీర్ యుసకూ మెజావాను చంద్రుడిపైకి తీసుకెళ్లేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ట్రిప్ కోసం యుసకూ 2018లోనే టిెకెట్‌ను కొనుగోలు చేశారు. జపాన్ దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన మెజావా దీని కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యుసకూ మెజావా.. ఆయనతో పాటు మరో ఎనిమిది మందిని చంద్రుడిపైకి తీసుకుపోనున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన స్వయంగా ప్రకటించారు. ఓ వీడియోను పోస్ట్ చేసిన మెజావా.. ప్రపంచ నలుమూలల నుంచి ఎవరైనా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇక ఈ జర్నీకి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కళాకారులై ఉండాలని మెజావా సూచించారు. చంద్రుడిపైకి వెళ్లేందుకు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఈ జర్నీని స్పేస్ ఎక్స్ సంస్థ.. డియర్ మూన్ మిషన్ పేరుతో చేపడుతోంది. మరి మెజావా చెప్పినట్లు మీరు కళాకారులైతే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.. చంద్రుడిపై అడుగు పెట్టే లక్కీ చాన్స్‌ను కొట్టేయండి.
Watch this video to learn more about the selection process. It also contains a special message from @elonmusk #dearMoon
↓Check the full versionhttps://t.co/i3ucR6BB44 pic.twitter.com/B3d8g0JvvP
— Yusaku Maezawa (MZ) (@yousuckMZ) March 2, 2021
Also Read: New Feature In WhatsApp: మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్… ఇకపై వీడియో పంపే ముందు..