AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: భారత్‌లోకి ప్రవేశిస్తోన్న ఎలాన్‌ మస్క్‌ ఇంటర్నెట్‌ సేవలు.. ప్రీ బుకింగ్‌లు మొదలయ్యాయి.. ధర ఎంతో తెలుసా?

Elon Musk Internet: టెస్లా పేరుతో కార్ల కంపెనీ ప్రారంభించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు ప్రముఖ వ్యాపార వేత్త ఎలాన్‌ మస్క్‌. విద్యుత్‌ కార్లతోపాటు...

Elon Musk: భారత్‌లోకి ప్రవేశిస్తోన్న ఎలాన్‌ మస్క్‌ ఇంటర్నెట్‌ సేవలు.. ప్రీ బుకింగ్‌లు మొదలయ్యాయి.. ధర ఎంతో తెలుసా?
Narender Vaitla
|

Updated on: Mar 02, 2021 | 7:56 PM

Share

Elon Musk Internet: టెస్లా పేరుతో కార్ల కంపెనీ ప్రారంభించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు ప్రముఖ వ్యాపార వేత్త ఎలాన్‌ మస్క్‌. విద్యుత్‌ కార్లతోపాటు, అంతరిక్ష రంగంలో ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అంతరిక్ష రంగంలో కొత్త ఒరవడి సృష్టిస్తూ.. సరికొత్త ఆవిష్కరణలకు బీజం వేస్తూ దూసుకెళుతున్నారు మస్క్‌. వీటితో పాటు ఎలాన్‌ మస్క్‌.. ఇంటర్నెట్‌ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ‘స్టార్‌ లింక్‌’ పేరుతో ఇంటర్నెట్‌ సేవలను సైతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తన ఇంటర్నెట్‌ సేవలను భారత్‌లోనూ తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా భారత్‌లో ప్రీ బుకింగ్‌లను కూడా ప్రారంభించిందీ సంస్థ. భారత్‌లో 2022 నుంచి ఈ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం స్పేస్‌ ఎక్స్‌ ఏకంగా అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని మస్క్‌ ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్నెట్‌ సేవల ద్వారా 50 ఎమ్‌బీపీఎస్‌ నుంచి 150 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో నెట్‌ సేవలు అందించనున్నట్లు కంపెనీ చెబుతోంది. స్టార్‌లింక్‌ సేవలకు ప్రపంచంలోని నలుమూలలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ప్రీ బుకింగ్ ప్రారంభించిన ఈ సంస్థ ధరను రూ.7,200గా నిర్ణయించింది. స్టార్‌లింక్‌ వెబ్‌సైట్‌లో ముందుగా బుకింగ్‌ చేసుకున్న వారికే ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. ఇదిలా ఉంటే ప్రీ బుకింగ్‌ కోసం రూ.7,200 కేటాయించిన సంస్థ.. తర్వాత నెలవారిగా ఎంత వసూలు చేస్తుందన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. భారత్‌తో పాటు స్పేస్‌ ఎక్స్‌ ఇప్పటికే కెనెడా, యూకే దేశాల్లో కూడా అనుమతి పొందడం విశేషం. భారత్‌లో టెలికామ్‌ రెగ్యులేరటీ ఆథారిటీ ఆఫ్‌ ఇండియాకు స్పేస్‌ ఎక్స్‌ 2020 సెప్టెంబర్‌లో భారత్‌లో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు లేఖ రాసింది. మరి స్టార్‌ లింక్‌ను భారతీయులు ఏమేర ఆదరిస్తారో చూడాలి.

Also Read: AUTO-RICKSHAW : ఆటో రిక్షాపై అందమైన ఇల్లు.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. బొలెరోపై నిర్మించగలవా అంటూ ట్వీట్..

Sansad TV: పార్లమెంట్ కార్యకలాపాలు ఇక ‘సంసద్ టీవీ’లో.. రాజ్యసభ, లోక్‌సభ టీవీల విలీనం..

Google Messages App: గూగుల్‌ కొత్త ఫీచర్‌.. మెసేజ్‌కు సమయం సెట్‌ చేసుకునే సదుపాయం.. ఎలాగంటే..