AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUTO-RICKSHAW : ఆటో రిక్షాపై అందమైన ఇల్లు.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. బొలెరోపై నిర్మించగలవా అంటూ ట్వీట్..

AUTO-RICKSHAW : తమిళనాడులోని నమక్కల్‌కు చెందిన ఎన్‌ జీ అరుణ్ ప్రభు ఆర్కిటెక్చర్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు చెన్నై, ముంబై మురికివాడల్లోని గృహాలపై పరిశోధన చేశాడు. అక్కడి నిర్మాణాల్లో

AUTO-RICKSHAW : ఆటో రిక్షాపై అందమైన ఇల్లు.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. బొలెరోపై నిర్మించగలవా అంటూ ట్వీట్..
uppula Raju
|

Updated on: Mar 02, 2021 | 7:33 PM

Share

AUTO-RICKSHAW : తమిళనాడులోని నమక్కల్‌కు చెందిన ఎన్‌ జీ అరుణ్ ప్రభు ఆర్కిటెక్చర్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు చెన్నై, ముంబై మురికివాడల్లోని గృహాలపై పరిశోధన చేశాడు. అక్కడి నిర్మాణాల్లో స్థలాన్ని సరిగ్గా వినియోగించకపోవడం వల్ల రూ.4-5 లక్షలు ఖర్చు చేసి ఇల్లు నిర్మించినా అందులో మరుగుదొడ్డి ఉండదని గ్రహించాడు. అయితే కొద్దిపాటి స్థలంలోనే తక్కువ ఖర్చుతో కంఫర్ట్‌బుల్‌గా ఇంటిని నిర్మించాలనేది అతని కల.

తన చదువు పూర్తికాగానే ఓ ఆటోరిక్షాలోని వెనుక భాగంలో 36 చదరపు అడుగుల్లో లక్ష రూపాయల్లోనే ఫోర్టబుల్ ఇంటిని నిర్మించి తక్కువ స్థలంలో మంచి ఇంటిని కట్టుకోవచ్చని నిరూపిస్తున్నాడు. ఈ ఆటోరిక్షా ఇంటిని సోలో 01 అని పిలుస్తుండగా ఈ ఆటో మొబైల్ హౌస్‌లో ఒక చిన్న బెడ్‌ రూం, కిచెన్, లివింగ్ ఏరియా, బాత్‌ రూంతో పాటు వర్కింగ్‌ ఏరియాకు కూడా ఓ గదిని ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఈ ఇంటిపై ప్రభు 250 లీటర్ల వాటర్ ట్యాంక్‌ను కూడా సిద్ధం చేశాడు. ఇందులో ఇద్దరు వ్యక్తులు హ్యాపీగా జీవనం సాగించవచ్చిన చెబుతున్నాడు. కొన్ని సంవత్సరాలు లేదా నెలలు ఓ ఏరియాలో ఉండేవారు అంటే కార్మికులు. సంచార జాతుల వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు.

అయితే ఆన్‌లైన్‌లో ఈ ఇంటిని చూసిన ప్రముఖ వ్యాపారవేత్త అతడి ఐడియాను పొడుగుతూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనిని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఆయన..‘అరుణ్ తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని ఎలా సృష్టించాలో చూపించాడు. అది ఒక పెద్ద ట్రెండ్ ను క్రియేట్ చేసిందన్నాడు. నిజానికి ఈ హోమ్‌ను ప్రదర్శన కోసం ఉంచాలనుకున్నాడని కూడా చెప్పారు. అంతేకాకుండా బొలెరో వాహనంపై నిర్మించగలవా అంటూ అడిగారు. కరోనా మహమ్మారి సమయంలో… ఎవరైనా మమ్మల్ని కనెక్ట్ చేయగలరా? అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి: APSSDC:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెటిరో డ్రగ్స్‌లో 80 జాబ్స్‌.. హైదరాబాద్‌, వైజాగ్‌లో ఖాళీలు.. Shamshabad Airport : మరో ఘనత సాధించిన శంషాబాద్ విమానాశ్రయం.. దీంతో ప్రయాణికులకు మరిన్ని సేవలు.. ఏంటో తెలుసా..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!