AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shamshabad Airport : మరో ఘనత సాధించిన శంషాబాద్ విమానాశ్రయం.. దీంతో ప్రయాణికులకు మరిన్ని సేవలు.. ఏంటో తెలుసా..

Shamshabad Airport : శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయానికి అరుదైన గౌరవం దక్కింది. గతేడాదికిగాను ప్రతిష్టాత్మక ఏసీఐ (ఎయిర్‌పోర్టు కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌), ఏఎస్‌క్యూ (ఎయిర్‌పోర్టు సర్వీస్‌ క్వాలిటీ) అవార్డు దక్కింది.

Shamshabad Airport : మరో ఘనత సాధించిన శంషాబాద్ విమానాశ్రయం.. దీంతో ప్రయాణికులకు మరిన్ని సేవలు.. ఏంటో తెలుసా..
uppula Raju
|

Updated on: Mar 02, 2021 | 6:08 PM

Share

Shamshabad Airport : శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయానికి అరుదైన గౌరవం దక్కింది. గతేడాదికిగాను ప్రతిష్టాత్మక ఏసీఐ (ఎయిర్‌పోర్టు కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌), ఏఎస్‌క్యూ (ఎయిర్‌పోర్టు సర్వీస్‌ క్వాలిటీ) అవార్డు దక్కింది. ఆసియా-పసిఫిక్‌ దేశాల్లోగల 15-25 మిలియన్‌ ప్యాసింజర్స్‌ (ఎంపిపిఏ) విభాగంలోని ఎయిర్‌పోర్టుల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ‘2020 ఉత్తమ విమానాశ్రయ’ గుర్తింపు అందుకున్నట్లు జీఎమ్మార్‌ వర్గాలు తెలిపాయి. ఏఎస్‌క్యూ అనేది విమానయాన సేవలు, ప్రయాణీకుల సంతృప్తికి కొలమానం. దీంతో ఏసీఐ నిర్వహించిన ఏఎస్‌క్యూ సర్వేలో ఉత్తమ అవార్డు రావడంపట్ల ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ ఆనందం వ్యక్తం చేశారు. తమకెంతో గర్వంగా ఉందన్నారు.

ప్రపంచంలోనే 10 అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒకటి. దీని పేరును భారత దేశ పూర్వపు ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన పేరుతో నామకరణం చేశారు. ఈ విమానాశ్రయం అంతకు పూర్వం గల బేగంపేట విమానాశ్రయం స్థానంలో మార్చబడింది. ఈ విమానాశ్రయం ద్వారా వాణిజ్య సేవలను మార్చి 23- 2008 నుంచి ప్రారంభించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత పబ్లిక్-ప్రైవేట్ ఉమ్మడి నిర్వహణలో నడుపబడుతున్న రెండో విమానాశ్రయం.

2010-11 లో భారత దేశ విమానాశ్రయాలలో అతి రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఆరవదిగా నిలిచింది. ఈ విమానాశ్రయం 2013 లో స్కైట్రాక్స్ ద్వారా ప్రపంచ విమానాశ్రయాలలో అధిక విశేష లక్షణాలున్న విమానాశ్రయంగా అగ్రభాగాన నిలిచింది. ఇది స్పెషల్ జెట్, సుఫ్తాంసా కాంగో, బ్లూడార్ట్ ఏవియేషన్ లకు కూడా తన సేవలందిస్తుంది. 2005 లో దీని డిజైన్, నిర్మాణం ప్రారంభించబడింది. ఈ విమానాశ్రయం మార్చి 2008 లో ప్రారంభించారు. ఈ విమానాశ్రయం పబ్లిక్, ప్రైవేట్ ఉమ్మడి యాజమాన్యంతొ నడుస్తోంది. జి.ఎం.ఆర్ గ్రూపు, మలేసియా ఎయిర్పోర్ట్స్ వంటి ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి పబ్లిక్ సంస్థలతో సంయుక్తంగా నడుస్తోంది. ఈ విమానాశ్రయంలో జి.ఎం.ఆర్ గ్రూపు 63%, తెలంగాణ ప్రభుత్వం, ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియాలకు 13% వాటాలున్నాయి.

శంషాబాద్ లో పెద్దపులి సంచారం.. భయాందోళనలో స్థానికులు.. పగ్ ఆనవాళ్లు కోసం ప్రయత్నిస్తున్న అధికారులు