వేలం పాటను ప్రకటించిన ఎస్బీఐ.. తక్కువ ధరకే ఇళ్ళను, వాహనాలను ఇలా పొందవచ్చు.. తేదీ ఎప్పుడంటే..
State Bank Of India e-auction: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈవేలం ప్రకటించింది. బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తులను ఈవేలం
State Bank Of India e-auction: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈవేలం ప్రకటించింది. బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తులను ఈవేలం (ఎలక్ట్రానిక్ వేలం) వేయడానికి తేదీని ప్రకటించింది. ఎస్బీఐ మార్చి 5న ఈ-వేలంలో అందించే ఆస్తులలో హౌసింగ్, రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ మొదలైనవి ఉండనున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఎస్బీఐ నిర్వహించే వేలం పాటకు హాజరయ్యి.. మీ అత్యత్తమ బీఐడీని తెలిపాలని ఎస్బీఐ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. “బీఐడీ ఫర్ బెస్ట్. అతి తక్కువ ధరలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్, భుమి, ప్లాంట్, మెషిన్స్, వాహనాలు మొదలైనవి ఉన్నాయి. ఎస్బీఐ మెగా ఈ-వేలంలో పాల్గోని మీ బెస్ట్ బీఐడీ ఇవ్వండి” అని ట్వీట్ చేసింది.
“స్థిరమైన ఆస్తులను పెట్టేటప్పుడు మేము చాలా పారదర్శకంగా ఉంటాము, బ్యాంకుతో తనఖా పెట్టడం, వేలం వేయడానికి కోర్టు ఉత్తర్వులతో జతచేసి.. వేలంపాటలో వేలం వేసేవారికి పాల్గొనడానికి ఆకర్షణీయమైన ప్రతిపాదనగా మారే అన్ని సంబంధిత వివరాలను ఇవ్వడం ద్వారా. మేము అన్ని సంబంధిత విషయాలను కూడా చేర్చుకుంటాము. వివరాలు, అదే ఫ్రీహోల్డ్ లేదా లీజుహోల్డ్ కాదా, దాని కొలత, స్థానం మొదలైనవి ఉంటాయి. వేలం కోసం జారీ చేసిన పబ్లిక్ నోటీసులలోని ఇతర సంబంధిత వివరాలను పొందుపర్చాలి.
ఎస్బీఐ మెగా ఈ-వేలంలో పాల్గొనడానికి కావల్సినవి..
☛ ఈ-వేలం నోటీసులో పేర్కొన్న విధంగా నిర్దిష్ట ఆస్తి కోసం EMD. ☛ కెవైసి పత్రాలను సంబంధిత ఎస్‌బీఐ శాఖకు సమర్పించాలి. ☛ వ్యాలిడిటీ అయ్యే డిజిటల్ సంతకం: డిజిటల్ సంతకాన్ని పొందటానికి బిడ్డర్లు ఈ-వేలం వేసేవారిని లేదా మరే ఇతర అథరైజ్డ్ ఏజెన్సీని సంప్రదించవచ్చు. ☛ బిడ్డర్ EMD డిపాజిట్, KYC పత్రాలను సంబంధిత శాఖకు సమర్పించిన తర్వాత వారి రిజిస్టర్డ్ లాగిన్ ID, పాస్వర్డ్ ఈ-వేలం వేసేవారు ఇమెయిల్ ఐడికి పంపుతారు.
Bid for the best! Here’s your chance to buy cheaper Residential & Commercial Properties, Land, Plant & Machinery, Vehicles and many more. Attend SBI Mega E-Auction and place your best bid. Know more: https://t.co/vqhLcagoFF #Auction #MegaEAuction #Properties #DreamHome #Land pic.twitter.com/80CNZueg6k
— State Bank of India (@TheOfficialSBI) March 1, 2021
Also Read: