AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS Star City Plus: టీవీఎస్‌ మోటారు నుంచి కొత్త స్టార్‌ సిటీ ప్లస్ బైక్‌.. అత్యధునిక ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల

TVS Star City Plus: వివిధ వాహన సంస్థలు రోజురోజుకు కొత్త మోడళ్ల బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలను కొనే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది...

TVS Star City Plus: టీవీఎస్‌ మోటారు నుంచి కొత్త స్టార్‌ సిటీ ప్లస్ బైక్‌.. అత్యధునిక ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల
Subhash Goud
|

Updated on: Mar 02, 2021 | 6:00 AM

Share

TVS Star City Plus: వివిధ వాహన సంస్థలు రోజురోజుకు కొత్త మోడళ్ల బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలను కొనే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు వాహన కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను తయారు చేస్తూ మార్కెట్లోకి వదులుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది వాహనదారులు ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. తాగాజా టీవీఎస్‌ మోటారు నుంచి కొత్త స్టార్‌ సిటీ ప్లస్‌ బైక్‌ మార్కెట్లోకి వచ్చింది. ఈ టీవీఎస్‌ స్టార్‌ సిటీ ప్లస్‌ బైక్‌ బీఎస్‌ 6 ఇంజిన్‌తో వస్తుంది. ఈ బైక్‌ అమ్మకాలు కూడా ప్రారంభం అయ్యాయి.బైక్ మోడల్ మోనోటోన్ , డ్యూయల్ టోన్లలో 2 వేరియంట్లలో విడుదల చేసింది సదరు కంపెనీ. ఈ వేరియంట్ల ధర వరుసగా రూ .62,034, రూ .62,534గా ఉన్నాయి.

బిఎస్ 6 మోనోటోన్ వేరియంట్ బిఎస్ 4 వేరియంట్ కంటే రూ .8,532 ఖరీదైనది. 2020 టీవీఎస్‌ స్టార్ సిటీ ప్లస్ బైక్‌లో ఇంధన ఇంజెక్షన్ సిస్టమ్‌తో బిఎస్ 6 కంప్లైంట్ 109 సిసి ఇంజన్ కలిగి ఉంది. ఈ ద్విచక్ర వాహనం ఇంజిన్ 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.08 బిహెచ్‌పి మరియు పీక్ టార్క్ 8.7 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుందని సదరు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఈ వాహనంలో 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. బైక్‌లో ఉపయోగించే ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీ తన ఇంధన వ్యవస్థను (మైలేజ్) 15% పెంచుతుందని కంపెనీ వెల్లడించింది. BS6 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇంజన్లు మెరుగైన మన్నిక మరియు నిర్వహణతో వస్తాయి.

బైక్‌లో యుఎస్‌బి మొబైల్ ఛార్జర్, డ్యూయల్ టోన్ సీట్, అధునాతన ఫీచర్లు:

కాగా, 2020 టీవీఎస్‌ స్టార్‌ సిటీ ప్లస్ బైక్‌లో అప్‌డేట్‌ చేసిన ఎల్‌ఇడి ఇంజన్లు, కొత్త ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, రీడివిజైన్డ్‌ రియర్ వ్యూ మిర్రర్స్, రివైజ్డ్ ఫెయిరింగ్ ఉన్నాయి. అంతేకాకుండా యూఎస్‌బీ మొబైల్ ఛార్జర్ మరియు డ్యూయల్ టోన్ సీటును వంటి సౌకర్యాలున్నాయి. బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్‌లో ఎటువంటి మార్పు లేదు. టీవీఎస్ యొక్క కొత్త స్టార్ సిటీ బైక్ టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్ ముందంజలో మరియు వెనుక భాగంలో 5 దశల సర్దుబాటు షాక్ అబ్జార్బర్స్ కలిగి ఉన్నాయని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.

ఇవి చదవండి:

Today Gold Rates: పసిడికి రెక్కలు.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తాజాగా దేశ వ్యాప్తంగా ధరల వివరాలు

Today Silver Price: మళ్లీ పరుగులు పెడుతున్న వెండి ధర.. దేశ వ్యాప్తంగా తాజా ధరల వివరాలు ఇలా..