Today Gold Rates: పసిడికి రెక్కలు.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తాజాగా దేశ వ్యాప్తంగా ధరల వివరాలు

Today Gold Rates: మళ్లీ బంగారం ధరలు భగ్గుమన్నాయి. దేశీయంగా తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు మంగళవారం ఎగబాకాయి. దేశీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల బంగారం...

Today Gold Rates: పసిడికి రెక్కలు..  మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తాజాగా  దేశ వ్యాప్తంగా ధరల వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 02, 2021 | 5:55 AM

Today Gold Rates: మళ్లీ బంగారం ధరలు భగ్గుమన్నాయి. దేశీయంగా తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు మంగళవారం ఎగబాకాయి. దేశీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పది గ్రాముల బంగారంపై రూ. 360 పెరిగింది. తగ్గుముఖం పడుతున్న బంగారం కొనేందుకు ముందుకొస్తున్న బంగారం ప్రియులకు ఈ రోజు షాకిచ్చాయి. తాజా ధరలను పరిశీలిస్తే..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,970 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,970 ఉంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,970 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,970 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340 వద్ద కొనసాగుతోంది.

అయితే తాజా ధరలు పరిస్థితులను బట్టి ధరల్లో మార్పు చేర్పులు ఉంటాయి. కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవి చదవండి:

Spectrum Auction: మొదటి రోజే రూ. 77 వేల కోట్ల ఆదాయం.. ఐదేళ్ల తర్వాత నిర్వహిస్తున్న టెలికం స్పెక్ట్రమ్‌ వేలం

SBI Interest Rates: గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్‌బీఐ