బాల్య వివాహమైన 12 ఏళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించిన యువతి.. తన పెళ్లి రద్దు చేయాలంటూ న్యాయస్థానంలో పిటిషన్‌

బాల్య వివాహమైన 12 ఏళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించిన యువతి.. తన పెళ్లి రద్దు చేయాలంటూ న్యాయస్థానంలో పిటిషన్‌

బాల్య వివాహాలు ఎన్నో అనర్థలకు దారి తీస్తాయి. దేశంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు అధికారులు ఎన్నో చర్యలు చేపడుతూనే ఉన్నాయి. కానీ గుట్టు చప్పుడు కాకుండా కొందరు..

Subhash Goud

|

Mar 02, 2021 | 5:39 AM

బాల్య వివాహాలు ఎన్నో అనర్థలకు దారి తీస్తాయి. దేశంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు అధికారులు ఎన్నో చర్యలు చేపడుతూనే ఉన్నాయి. కానీ గుట్టు చప్పుడు కాకుండా కొందరు తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా బాల్య వివాహం చేసుకున్న ఓ యువతి 12 ఏళ్ల తర్వాత తన పెళ్లిన రద్దు చేయాలంటూ సోమవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంఘటన సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని బిల్‌వారా జిల్లాలో ని పలాడి గ్రామానికి చెందిన మన్షి అనే యువతికి ఏడేళ్లు ఉన్నప్పుడు అంటే 2009లో వివాహం అయింది. ఆ తర్వాత నుంచి ఇంటి వద్దే ఉంటూ చదువుకుంటోంది. ప్రస్తుతం ఆ యువతి డిగ్రీ చదువుతోంది. అయితే బాల్య వివాహంలో చేసుకున్న ఆ యువతిని ఇప్పుడు అత్తింటి వారు కాపురానికి రావాలంటూ ఒత్తిడికి తీసుకువస్తున్నారని యువతి కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ యువతి ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. తనకు జరిగిన బాల్య వివాహం చెల్లదని తేల్చి చెప్పింది. కాపురానికి రాకపోతే పంచాయతీలో పెట్టి కుటుంబ పరువు తీస్తామని అత్తింటి వారు వేదింపులకు గురి చేస్తున్నట్లు యువతి చెబుతోంది. ఇక వారి వేధింపులు ఎక్కువ కావడంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత సారథి ట్రస్ట్‌ సహకారంతో మన్షి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ముకేష్‌ భార్గవ, మన్షి భర్తకు సమన్లు జారీ చేశారు. బాల్య వివాహాల విషయంలో కఠిన చర్యలు ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.

అయితే చట్ట ప్రకారం ఎవరైనా తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేస్తే అందుకు పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు బాల్య వివాహానికి సహకరించినట్లయితే రెండు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అయితే ఐక్యరాజ్యసమితిలోనియునిసెఫ్‌ ప్రకారం 18 ఏళ్లకు ముందు మైనర్లకు పెళ్లి చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. అయినా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అవి జరుగుతూనే ఉన్నాయి. యునిసెఫ్ వివరాల ప్రకారం భారత్‌లో ప్రతి ఏటా దాదాపు 15 లక్షల మంది బాలికలకు 18 ఏళ్ల లోపే పెళ్లిళ్లు చేస్తున్నారు

బాల్య వివాహాల ప్రభావం

చిన్న వయస్సులోనే వివాహాలు జరగడం వల్ల ఆడ పిల్లలు అనారోగ్యం పాలవుతారు. చిన్న వయస్సులోనే లైంగిక సంపర్కంతో బాటు, గర్భవతులు కావడం, దీనితో పాటు రక్త హీనత, ఇతర వ్యాధులు సోకడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. బాల్య వివాహాల వలన చాలా వరకు వారి చదువు ఆగిపోవడం, లేదా అర్ధవంతమైన పనిలేకపోవడం వలన పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. లేత వయస్సులో వివాహాలు జరగడం వల్ల కాన్పు కష్టం కావటం వల్ల ప్రసూతి మరణాలు , శిశు మరణాలు అధిక శాతంలో సంభవిస్తాయి

ఇవి చదవండి:

సోదరుడి కోసం సరోగసీ తల్లిగా మారిన సోదరి.. కృత్రిమంగా బిడ్డకు జన్మనిచ్చిన 42ఏళ్ల మహిళ..!

Special Tea: గంగూలీ టీ స్టాల్‌లో టీ ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు.. అక్షరాల వెయ్యి రూపాయలు.. !

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu