AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Tea: గంగూలీ టీ స్టాల్‌లో టీ ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు.. అక్షరాల వెయ్యి రూపాయలు.. !

Special Tea: చాలా మందికి ఉదయం లేవగానే టీ లేనిదే రోజు గడవదు. ప్రతి ఒక్క కప్పు టీతో పనులు మొదలు పెడతారు. పనుల్లో అలసిపోయినా, తలనొప్పిగా ఉన్నా.. కప్పు టీ తాగితేనే...

Special Tea: గంగూలీ టీ స్టాల్‌లో టీ ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు.. అక్షరాల వెయ్యి రూపాయలు.. !
Subhash Goud
|

Updated on: Mar 02, 2021 | 2:34 AM

Share

Special Tea: చాలా మందికి ఉదయం లేవగానే టీ లేనిదే రోజు గడవదు. ప్రతి ఒక్క కప్పు టీతో పనులు మొదలు పెడతారు. పనుల్లో అలసిపోయినా, తలనొప్పిగా ఉన్నా.. కప్పు టీ తాగితేనే క్షణాల్లో రిలాక్స్‌ అనిపిస్తుంది. అందుకే చాలా మంది రోజుకు ఐదారు సార్లకు మించి టీని తాగుతుంటారు. అయితే టీ ఖరీదు కూడా పెద్దగా ఉండకపోవడంతో చాలా మందికి టీ అలవాటు బాగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ టీస్టాల్‌లో టీ ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు. ఏకంగా రూ. 1000 ఉంటుందట. పశ్చిమబెంగాల్‌లో రోడ్డు పక్కనే ఉండే ఓ టీస్టాల్‌లో ఇంత ఖరీదైన టీ ఉంటుంది. కోల్‌కతాకు చెందిన పార్థ ప్రతీమ్‌ గంగూలీ అనే వ్యక్తి ఆ టీ స్టాల్‌ను నిర్వహిస్తున్నాడు.

కోల్‌కతాలోని ముకుంద్‌పూర్‌లో ఉన్న గంగూలి టీ స్టాల్‌లో వందకుపైగా వెరైటీ టీలు లభిస్తాయి. వివిధ సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఆ టీకి అక్కడ ఎంతో క్రేజ్‌ ఉంది. అందుకే అతని టీ స్టాల్‌ అక్కడ చాలా ఫేమస్‌. కేవలం బెంగాల్‌ ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల వచ్చి చాలా మంది టీ తాగుతుంటారని గంగూలి చెబుతున్నాడు. అయితే టీ స్టాల్‌ నిర్వహించే గంగూలీ వద్ద 12 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అన్ని రకాల టీలు లభిస్తాయి. వెయ్యి రూపాయలకు అమ్మే టీని జపనీస్‌ వైట్‌ లీఫ్‌ టీగా పిలుస్తారట.

అయితే ఆ ప్రీమియం టీకి వెయ్యి రూపాయల ధర పెద్ద ఎక్కువేమి కాదంటున్నాడు గంగూలీ. ఎందుకంటే ఆ టీ తయారీకి వాడే పదార్థాలన్ని చాలా ఖరీదైనవట. అంతేకాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవని చెబుతున్నాడు. అందుకే ఆ టీ స్టాల్‌ మీదుగా వెళ్లే ప్రతి 1000 మందిలో కనీసం 100 మంది తప్పకుండా అక్కడ ఆగి టీని తాగుతారని గంగూలీ వెల్లడించాడు.

ఇక ఆ టీ స్టాల్‌ గంగూలీని చుట్టుపక్కల ప్రజలంతా ముద్దుగా పార్థ బాబూ అని పిలుస్తుంటారట. అక్కడి స్థానికులు కొన్ని వెరైటీ టీలకు ముందుగానే అడ్వాన్స్ చెల్లిస్తుంటారట. గంగూలీ కేవలం టీని అమ్మడం మాత్రమే కాదు, టీ పౌడర్‌ని కూడా విక్రయిస్తాడు. అంతేకాదు దేశవ్యాప్తంగా చాలా మంది టీ తయారు చేసే వ్యాపారులు తన వద్ద ముడి టీని తీసుకెళ్తారని గంగులీ చెబుతున్నాడు.

ఇవి చదవండి:

Fruit Juices: సమ్మర్‌లో అధిక శక్తిని ఇచ్చే పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు

Immunity: రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు