కరోనా ఎఫెక్ట్: న్యాయవాదికి మాస్క్ లేనందున కోర్టులో వాదించేందుకు నిరాకరించిన న్యాయమూర్తి.. విచారణ వాయిదా
ఒక న్యాయవాది కోర్టులో తన కేసును వాదించేందుకు కోర్టు జడ్జి నిరారించారు. అందుకు కారణం లాయర్ మాస్క్ ధరించకపోవడమే. న్యాయవాది మాస్క్ ధరించకుండా వాదిస్తుండగా వాదించేందుకు ..
ఒక న్యాయవాది కోర్టులో తన కేసును వాదించేందుకు కోర్టు జడ్జి నిరారించారు. అందుకు కారణం లాయర్ మాస్క్ ధరించకపోవడమే. న్యాయవాది మాస్క్ ధరించకుండా వాదిస్తుండగా వాదించేందుకు అనుమతి లేదని ముంబై హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టుకు చెందిన సింగిల్ బెంచీ న్యాయమూర్తి పృథ్వీరాజ్ చవాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయవది తన మాస్క్ తొలగించి వాదనలు వినిపించేందుకు రెడీ అయ్యారు. దీనిని గమనించిన జస్టిస్ చవాన్ వెంటనే స్పందిస్తూ ఆ కేసును విచారించేందుకు నిరాకరించి మరో కొత్త తేదీని ప్రకటించారు. లాక్‌డౌన్ సమయంలో కోర్టులు ఆన్‌లైన్‌లోనే కేసులను విచారించాయి.
అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇటీవల నుంచి కోర్టులు కేసుల విచారణ చేపడుతున్నాయి. విచారణ సమయంలో కూడా కోర్టులు కరోనా నిబంధనలు పాటిస్తూనే విచారణ జరుపుతున్నాయి. అదే సమయంలో కరోనా నిబంధనలను అనుసరించాలని తీర్మానించారు. ఈ ఎస్‌ఓపీఎస్ ప్రకారం కోర్టులో న్యాయవాదులతో సహా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది. జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ.. కోర్టులో న్యాయ విచారణ జరిపేటప్పుడు ఆ కేసుకు సంబంధించిన వారు మాత్రమే కోర్టు హాలులో ఉండాలని, మిగతా న్యాయవాదులంతా పక్క రూమ్‌లో ఉండి తమ వంతు వచ్చే వరకు వేచి ఉండాలని అన్నారు. కేసుల విచారణ సమయంలో సబార్డినేట్లు వాదిస్తున్నప్పుడు న్యాయస్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తులు కూడా మాస్క్‌లు తప్పకుండా ధరించాల్సిందేనని ఆయన అన్నారు.
ఇలా కరోనా తెచ్చిన తంటాలు అన్ని ఇన్ని కావు. కరోనా కారణంగా చివరికి కోర్టులో కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. కాగా, ఇక ముంబైలో ఇటీవల నుంచి కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి మరిన్ని ఆంక్షలు విధిస్తోంది. ముంబైలో మాస్క్ ధరించని వారిపై భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు అధికారులు. పలు ప్రాంతాల్లో అయితే లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా పలు రాష్ట్రాల్లో అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది.
ప్రధాని అడుగు జాడలలో, నేనూ వ్యాక్సిన్ తీసుకున్నా .. హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడి