ప్రధాని అడుగు జాడలలో, నేనూ వ్యాక్సిన్ తీసుకున్నా .. హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడి
ప్రధాని మోదీ అడుగుజాడల్లో నేనూ అంటున్నారు హోమ్ మంత్రి అమిత్ షా.. తన తొలిడోసు కోవిడ్ వ్యాక్సిన్ ని ఆయన తీసుకున్నారు. ఇలాగే నేడు మంత్రులు ఎస్. జైశంకర్, జితేంద్ర సింగ్, ఎన్సీపీ నేత శరద్ పవార్ తదితరులు......
ప్రధాని మోదీ అడుగుజాడల్లో నేనూ అంటున్నారు హోమ్ మంత్రి అమిత్ షా.. తన తొలిడోసు కోవిడ్ వ్యాక్సిన్ ని ఆయన తీసుకున్నారు. ఇలాగే నేడు మంత్రులు ఎస్. జైశంకర్, జితేంద్ర సింగ్, ఎన్సీపీ నేత శరద్ పవార్ తదితరులు కూడా తమ తొలిడోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రధాని మోదీ ఈ ఉదయం ఎయిమ్స్ లో మొదటి డోసు తీసుకున్న సంగతి విదితమే. మళ్ళీ 28 రోజుల తరువాత వీరంతా రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఈ వ్యాక్సిన్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ కో-విన్ పోర్టల్ ద్వారా ప్రారంభమైంది. కాగా బీహార్ లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అక్కడ ప్రయివేటు ఆస్పత్రుల్లో కూడా ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తారని ప్రభుత్వంప్రకటించింది. ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో 250 రూపాయలకు ఒక డోసు చొప్పున ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితమని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
60 ఏళ్ళు, 45 ఏళ్ళ వారిలో వివిధ వ్యాధులున్నవారికి దేశవ్యాప్తంగా వ్వ్యాక్సినేషన్ కార్యక్రమం నేడు ప్రారంభమయింది. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కరోనా ఫ్రీ ఇండియాగా ఈ దేశాన్ని మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే బీజేపీ నేతల్లో పలువురు వ్యాక్సిన్ తీసుకోవడంతో ఇక ఈ రాజకీయ నేతలంతా టీకామందు తీసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. అటు పలు దేశాలు ఇండియా చేపట్టిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ పట్ల ఆసక్తిని చూపుతున్నాయి. భారత ప్రధాని స్వయంగా వ్యాక్సిన్ తీసుకోవడంపట్ల ఆయా దేశాలు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశాయి. దేశంలో ఇక కాంగ్రెస్, ఇతర విపక్ష నేతలు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వచ్ఛే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని ఎక్కడ చదవండి :
జడ్జినే ప్రలోభపెట్టారట ! ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి మూడేళ్ళ జైలుశిక్ష! అయితే !
నిరుడుగప్పిన నిప్పులా మారిన భారత్-చైనా సరిహద్దు వివాదం.. బలగాలు వెనక్కు తగ్గినా.. మారని పరిస్థితి