AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోదరుడి కోసం సరోగసీ తల్లిగా మారిన సోదరి.. కృత్రిమంగా బిడ్డకు జన్మనిచ్చిన 42ఏళ్ల మహిళ..!

ఆరోగ్య సమస్యలతోనూ ఇతరత్రా కారణాల వల్ల సహజంగా తల్లిదండ్రులు కాలేనివారు.. కృత్రిమంగా బిడ్డకు పొందడానికి ప్రయత్నిస్తారు.

సోదరుడి కోసం సరోగసీ తల్లిగా మారిన సోదరి.. కృత్రిమంగా బిడ్డకు జన్మనిచ్చిన 42ఏళ్ల మహిళ..!
Balaraju Goud
|

Updated on: Mar 01, 2021 | 9:41 PM

Share

Sister as a surrogate mother : ఆరోగ్య సమస్యలతోనూ ఇతరత్రా కారణాల వల్ల సహజంగా తల్లిదండ్రులు కాలేనివారు.. కృత్రిమంగా బిడ్డకు పొందడానికి ప్రయత్నిస్తారు. అలాంటి కృత్రిమ గర్భధారణ విధానంలో సరోగసీ ఒకటి. భార్య అండాన్ని.. భర్త వీర్యాన్ని కలిపి.. మరో మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. సాధారణంగా పిల్లలు కనాలనుకునే వారికి పరిచయం లేని వ్యక్తులు సరోగసి తల్లులు అవుతుంటారు. కానీ, అమెరికాలో ఓ మహిళ స్వలింగ సంపర్కుడైన తన సోదరుడి కోసం సరోగసీ తల్లిగా మారింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అమెరికాలోని మాంచెస్టర్‌లో నివసించే ఆంథోని డీగాన్‌.. రే విలియమ్స్‌ స్వలింగసంపర్కులు. గతకొంత కాలంగా వీరిద్దరు తండ్రులుగా మారాలని భావించారు. ఇందుకోసం గర్భం అద్దెకి ఇచ్చే సరోగసీ తల్లి కోసం ప్రయత్నించారు. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆంథోని డీగాన్‌ 42 ఏళ్ల తన సోదరి ట్రేసీ హుల్సే సరోగసీ తల్లిగా మారేందుకు సిద్ధపడింది. దీంతో ఆమె గర్భంలోకి ఆంథోని, విలియమ్స్‌ వీర్యాన్ని, పరిచయం లేని ఇద్దరు మహిళల అండాలను ఐవీఎఫ్‌ విధానంలో ట్రేసీ గర్భంలోకి ప్రవేశ పెట్టారు. రెండుసార్లు విఫలం కాగా.. మూడో సారి గర్భం నిలిచింది.

ఇదిలావుంటే. ట్రేసీ భర్త సరోగసీ విధానానికి అభ్యంతరం తెలిపాడు. వయసు దృష్ట్యా సమస్యలు తలెత్తుతాయని అడ్డు చెప్పాడట. కానీ, భర్తకు నచ్చజెప్పిన ట్రేసీ సరోగసీ తల్లిగా మారేందుకు ఒప్పేసుకుంది. కొన్ని నెలల కిందట ట్రేసీ ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆంథోని.. విలియమ్స్‌ తండ్రులుగా మారడం కోసం దాదాపు రూ. 40లక్షలు ఖర్చు చేశారు. సోదరి గర్భం ద్వారానే తండ్రి అయినందుకు ఆంథోని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. గతంలోనూ ఓ వృద్ధురాలు తన కూతురు మాతృత్వాన్ని పొందాలని తానే సరోగసీ తల్లిగా మారి వార్తల్లోకి ఎక్కింది. సరోగసీ విధానంలో అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, వయసు మీరినవారు ఇలాంటి ప్రయత్నాలకు దూరంగా ఉంటే మంచిదంటున్నారు.

Read Also.. జడ్జినే ప్రలోభపెట్టారట ! ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి మూడేళ్ళ జైలుశిక్ష! అయితే !