AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPhone: ఆపిల్ ఫోన్ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంది.. తీరా పార్శిల్ విప్పి చూశాక షాక్‌కి గురైంది.. ఇంతకీ ఏమైంది..

Woman Ordered Apple Phone: ఆన్‌లైన్ షాపింగ్ పెరుగుతోన్న కొద్దీ అందులో మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దేశం ఏదైనా మోసాలు మాత్రం కామన్ అయిపోయాయి...

IPhone: ఆపిల్ ఫోన్ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంది.. తీరా పార్శిల్ విప్పి చూశాక షాక్‌కి గురైంది.. ఇంతకీ ఏమైంది..
Narender Vaitla
|

Updated on: Mar 01, 2021 | 9:54 PM

Share

Woman Ordered Apple Phone: ఆన్‌లైన్ షాపింగ్ పెరుగుతోన్న కొద్దీ అందులో మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దేశం ఏదైనా మోసాలు మాత్రం కామన్ అయిపోయాయి. ఇక ఆన్‌లైన్ వేదికగా జరిగే మోసాలు కొన్ని అయితే.. ప్రాడక్ట్ డెలివరీ సమయంలో జరిగే మోసాలు మరికొన్ని.

ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ బుక్ చేసుకుంటే బండ రాళ్లు రావడం మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. డెలివరీ బాయ్స్ లేదా వేర్ హౌజ్‌లో ఉండే సిబ్బంది చేతి వాటం కారణంగానే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని సదరు సంస్థల నిర్వాహకులు గుర్తించారు. అయితే తాజాగా చైనాలో కూడా ఇలాంటి ఓ మోసమే జరిగింది. లీ అనే ఓ మహిళా యాపిల్ వెబ్‌సైట్ ద్వారా రూ. లక్ష విలువ చేసే ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్‌ను బుక్ చేసుకుంది. ఇక తాను ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసుకున్న ఐఫోన్ గురించి ‘లీ’ ఆతృత‌గా ఎదురుచూసింది.. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూడగానే లీ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. యాపిల్ ఫోన్ బుక్ చేసుకున్న పార్శిల్‌లో ఉన్న యాపిల్ డ్రింక్‌ను చూడగానే కంగుతిన్నది. దీంతో పార్శిల్‌లో వచ్చిన యాపిల్ డ్రింక్‌ను ఫొటో తీసిన లీ.. వైబో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. యాపిల్ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసినా ఇలా మోసం జరగడంపై లీ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తాను పార్శిల్‌ను నేరుగా స్వీకరించలేనని చెప్పడం గమనార్హం.. తన నివాసంలో ఉన్న పార్శిల్ లాకర్‌లో ఫోన్‌ను డెలివరీ చేసి వెళ్లే ఆప్షన్‌ను ఎన్నుకున్నట్లుగా ఆ పోస్టులో తెలిపారు. దీంతో ఆ సమయంలోనే ఎవరైనా పార్శిల్‌లో ఫోన్‌ను మాయం చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఆ ఫోన్‌ను డెలివరీ చేసిన సంస్థ కూడా ఆమె చెప్పిన చోటే పార్శిల్‌ను పెట్టి వెళ్లినట్లు చెబుతోంది. మరి ఇంతకీ ఆ ఫోన్ ఏమైపోయిందో విచారణ పూర్తయితే కానీ తెలియదన్నమాట.

Apple Drink Instead Apple Phone

Also Read: సోదరుడి కోసం సరోగసీ తల్లిగా మారిన సోదరి.. కృత్రిమంగా బిడ్డకు జన్మనిచ్చిన 42ఏళ్ల మహిళ..!

soup for night time: రాత్రిళ్లు ఈ సూప్ తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయట.. ఎలా తయారు చేయాలంటే..

నిరుడుగప్పిన నిప్పులా మారిన భారత్-చైనా సరిహద్దు వివాదం.. బలగాలు వెనక్కు తగ్గినా.. మారని పరిస్థితి