SBI Interest Rates: గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్‌బీఐ
SBI home loans: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాల వ్యాపారంలో శరవేగంగా దూసుకుపోతోంది. గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.
SBI Home Loan: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాల వ్యాపారంలో శరవేగంగా దూసుకుపోతోంది. గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. హోమ్ లోన్‌పై వడ్డీ రేటును బాగా తగ్గించింది. గృహ రుణంపై 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రుణంపై 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయని వెల్లడించింది. రుణ మొత్తం, సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. అయితే మార్చి నెలాఖరు వరకే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ తమ ప్రకటనలో చెప్పింది.
₹75 లక్షల వరకు రుణాలపై 6.70 శాతం వడ్డీకే రుణాలు అందిస్తామని.. ₹75 లక్షల నుంచి ₹5 కోట్ల వరకు రుణ మొత్తంపై 6.75 శాతం వడ్డీ వర్తిస్తుందని తెలిపింది. ప్రాసెసింగ్ ఫీజుపైనా నూరు శాతం రాయితీ అందిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. అదేవిధంగా ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ తీసుకుంటే మరో 5 బేసిస్ పాయింట్ల అదనపు రాయితీ లభిస్తుందని ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రుణ గ్రహీతలకు అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీని అందిస్తున్నట్లు పేర్కొంది.
ఒక్క ఎస్ఎంఎస్‌తో రూ.14 లక్షల వరకు పెన్షన్ లోన్..
ఇదిలావుంటే…స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు రోజురోజుకు సరికొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా పెన్షనర్ల కోసం సరికొత్త లోన్ ఆప్షన్‌ను తీసుకువచ్చింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేసింది. కేవలం ఒక్క ఎస్‌ఎంఎస్ చేస్తే చాలు ఎస్‌బీఐ రుణం అందిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛన్ తీసుకునేవారు, డిఫెన్స్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు రుణం తీసుకునేందుకు అర్హులు అని ఎస్‌బీఐ ప్రకటించింది. అలాగే 9.75 శాతం వడ్డీతో సంతోషంగా రిటైర్మెంట్ తీసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ లోన్ 14 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుందని ఎస్‌బీఐ అధికారులు చెబుతున్నారు.