Actress Jayasudha: సహజనటి ఏంటి ఇలా అయిపోయింది.. షాక్‌కు గురవుతున్న అభిమానులు, నెటిజన్లు

 Actress Jayasudha New Look:  సహజనటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన నటనతో దశాబ్దాల పాటు ఆమె తెలుగు ప్రేక్షకులను ఓలలాడించారు.

Actress Jayasudha: సహజనటి ఏంటి ఇలా అయిపోయింది.. షాక్‌కు గురవుతున్న అభిమానులు, నెటిజన్లు
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 28, 2021 | 7:45 PM

Actress Jayasudha New Look:  సహజనటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన నటనతో దశాబ్దాల పాటు ఆమె తెలుగు ప్రేక్షకులను ఓలలాడించారు. ఎన్టీఆర్, ఏన్నార్, శోభన్ బాబు వంటి అగ్రహీరోల సరసన ఆడిపాడారు. ప్రస్తుత హీరోలకు అమ్మ పాత్రల్లో అద్బుతంగా ఇమిడిపోయారు. ఇక నయా జనరేషన్ హీరోలకు అమ్మమ్మ, నాన్నమ్మ పాత్రలు వేస్తున్నారు ఆవిడ. అయితే ఏ పాత్ర వేసినా దానికి తనదైన మార్క్ వెయిట్ తీసుకొస్తారు జయసుధ. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన అద్భుతం అని చెప్పాలి. కాగా ఇటీవలి కాలంలో జయసుధ సినిమాల్లో కనిపించలేదు. తాజాగా ఓ సీరియల్ గురించి జయసుధ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అందులో ఆమె తెల్ల జుట్టుతో కనిపిస్తున్నారు. చాలా సన్నగా కూడా అయిపోయారు. డైట్ చేసి కావాలనే వెయిట్ తగ్గారా..? లేక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా..? తెలియాల్సి ఉంది.

ఇక తాజా వీడియోలో జయసుధ జానకి కలగనలేదు అనే సీరియల్ గురించి మాట్లాడారు. త్వరలో ఈ సీరియల్ వీక్షకుల ముందుకు రాబోతున్నట్లు చెప్పారు. “జానకి కలగనలేదు.. రాముని సతికాగలనని ఏనాడు”..అనే సాంగ్ తాను, శోభన్ బాబు కలిసి నటించామని.. ఆ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసినట్లు చెప్పారు. ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ పాట.. అన్ని కార్యక్రామాల్లో భాగమైందని చెప్పారు. అప్పట్లో ఆ సాంగ్‌ను ఊటీలో షూట్ చేశామని.. ఆ పాటలోని తన కాస్ట్యూమ్స్ కూడా ప్రేక్షకులకు నచ్చాయని చెప్పారు. ఇప్పుడు ఆ సాంగ్ పేరుతో సీరియల్ రాబోతుందని.. ఆ టీమ్ అందరకీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సీరియల్ మెగా సక్సెక్ కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

జయసుధ తెలుగువారే…

నటిగా ప్రేక్షకులను మెప్పించిన జయసుధ 1958, డిసెంబర్‌ 17న మద్రాసులో జన్మించింది. అలా అని తమిళ వారనుకోకండి. ఆమె స్వచ్చమైన తెలుగువారే. జయసుధ అసలు పేరు సుజాత. టీచర్‌  కావాలనుకున్న జయసుధను సినిమా రంగం విజయనిర్మల రూపంలో ఆహ్వానిచ్చింది. విజయ నిర్మల ప్రోత్సాహంతో వెండితెరపై అగ్రకథానాయికగా రాణించారు జయసుధ.

Also Read:

దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్‌ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు

లైంగిక శక్తి పెరుగుతుందని, వీర్యపుష్టి కలుగుతుందని ప్రచారం.. ఏపీలో గాడిదలు కనుమరుగు

ఈ గోల్డ్ మ్యాన్ హీరోగా మారాడు.. హీరోయిన్‌ ఎవరో తెలిస్తే షాకవుతారు…

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!