Shanmukh Jaswanth Deepthi Sunaina: దీప్తి, షణ్ముఖ్‌ జశ్వంత్ మధ్య రిలేషన్ ఏంటి..? ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందా..?

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌రు 10లో శనివారం రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించిన విషయం తెలిసిందే. యూట్యూబ్ ఫేమ్‌, టిక్‌టాక్‌తో బాగా ప్రాచూర్యాన్ని పొంది ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ న‌డుపుతున్న...

Shanmukh Jaswanth Deepthi Sunaina: దీప్తి, షణ్ముఖ్‌ జశ్వంత్ మధ్య రిలేషన్ ఏంటి..? ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందా..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 28, 2021 | 12:19 PM

Shanmukh About Break Up Rumour With Deepthi Sunaina: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌రు 10లో శనివారం రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించిన విషయం తెలిసిందే. యూట్యూబ్ ఫేమ్‌, టిక్‌టాక్‌తో బాగా ప్రాచూర్యాన్ని పొంది ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ న‌డుపుతున్న కారు అదుపుత‌ప్పి మ‌రో రెండు కార్లు, రెండు బైక్‌ల‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై ప్ర‌యాణిస్తున్న ఓ వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. షణ్ముఖ్‌ జశ్వంత్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా..  170 రీడింగ్ వచ్చింది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షణ్ముక్ ర్యాష్ డ్రైవింగ్ చేసి.. వాహనాలకు ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు.

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా షణ్ముక్ చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘వైవా’ అనే షార్ట్ ఫిల్మ్ అతని క్రేజ్‌ను మరింత పెంచింది. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారానే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు షణ్ముక్. అంతేకాదు.. తెలుగు హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ కవర్ చేస్తూ కూడా గుర్తింపు పొందాడు. యూట్యూబ్‌లో షణ్ముక్ ఫాలోవర్స్ దాదాపు మూడు కోట్ల మంది ఉన్నారంటే అతని ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కుర్రాడి వైజాగ్‌ అని తెలుస్తుంది. 2015 లో బీటెక్ కంప్లీట్ చేశాడు.

దీప్తి సునయన-షణ్ముఖ్  లవ్‌లో ఉన్నారా..?

షణ్ముఖ్ జశ్వంత్ – బిగ్ బాస్ ఫేమ్ సునయన లవ్‌లో ఉన్నారన్న విషయం బహిరంగ రహస్యమే. తొలుత ఈ జంట బాగా క్లోజ్‌గా మూవ్ అయ్యింది. ఇద్దరూ లవ్ టాటూలు వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒక ఇంటర్వ్యూలో అయితే ఆ టాటూ దీప్తి కోసం వేసుకున్నాని బహిరంగంగా చెప్పాడు షణ్మఖ్.  అయితే .. బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన తరువాత షణ్ముఖ్- సునయన మధ్య గ్యాప్ వచ్చిందని.. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు సర్కులేట్ అయ్యాయి. అయితే అవన్నీ రూమర్స్ మాత్రమే అని వీళ్ల లవ్ ట్రాక్ ఇంకా కొనసాగుతూనే ఉందని ‘స్టార్ మా 100% లవ్’ ఇటీవలి ఎపిసోడ్‌ను బట్టి తెలుస్తుంది. అంతేకాదు సోషల్ మీడియా లైవ్‌లో ఒకసారి షణ్మఖ్ మాట్లాడుతుండగా.. దీప్తితో మీకు బ్రేకప్ అయ్యిందా అనే ప్రశ్నను సంధిచాడు నెటిజన్. దానికి సమాధానంగా తన చేతిపై ఉన్న టాటూ చూపిస్తూ.. అది పోయినప్పుడే తన మీద లవ్ పోతుందని చెప్పుకొచ్చాడు.

Deepthi-Shanmuk- in love

ప్రేమించి పెళ్లి చేసుకున్న టీవీ, మూవీస్‌కు సంబంధించిన సెలబ్రిటీ కపుల్స్‌‌తో 100% లవ్ అంటూ ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీ కపుల్స్ ఈ ప్రొగామ్‌లో మెరవగా.. తాజాగా షణ్ముఖ్ జశ్వంత్‌-సునయన జంట ఈ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చి.. రొమాంటిక్ టచ్ ఇచ్చారు.

బుట్టబొమ్మ సాంగ్ స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు ఈ రొమాంటిక్ జంట అదరగొట్టింది. ఈ కార్యక్రమంలో దీప్తి షణ్ముఖ్‌ గురించి మాట్లాడుతూ ‘నువ్ ఇచ్చిన 21 గిఫ్ట్స్‌లో లవ్ ఉంది’ అని తమ లవ్ స్టోరీపై 100% లవ్ షో వేదికగా క్లారిటీ ఇచ్చేసింది. ఇక దీప్తి సునయన అండ్ షణ్ముఖ్ రియల్ లైఫ్ కపుల్ అంటూ ప్రొగ్రామ్ నిర్వాహకులు పేరు కూడా పెట్టేయడంతో వీళ్లు కాబోయే రియల్ కపుల్ అని ఫిక్స్ అయిపోతున్నారు నెటిజన్లు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో కూడా వీరిద్దరూ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు యూట్యూబ్‌లో సూపర్ హిట్స్ అయ్యాయి. మిలియన్ల హిట్స్ వచ్చాయి. మరి ఇదే సక్సెస్‌ను ఈ జంట రియల్ లైఫ్‌లోనూ లీడ్ చేస్తుందో, లేదో చూడాలి.

Also Read:

తప్ప తాగి డ్రైవింగ్.. ఏకంగా మూడు వాహనాలు ఢీకొట్టిన యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్

ఇండియన్ ఐడల్ లో పాల్గొని తమ ప్రతిభ చూపించిన తెలుగు గాయనీగాయకులు ఎవరంటే..