AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu contestants in Indian Idol : ఇండియన్ ఐడల్ లో పాల్గొని తమ ప్రతిభ చూపించిన తెలుగు గాయనీగాయకులు ఎవరంటే..

కళకు, గాత్రానికి ఎల్లలు లేవు.. భాషాబేధం లేదు.. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసిని ఇండియన్ ఐడల్ షో.. పాప్ ఐడల్ ను మన దేశంలో సోని ఎంటర్టైన్మెంట్ ఇండియన్ ఐడల్ గా దేశీ వెర్షన్ గా 2004 లో తీసుకుని వచ్చింది...

Telugu contestants in Indian Idol : ఇండియన్ ఐడల్ లో పాల్గొని తమ ప్రతిభ చూపించిన తెలుగు గాయనీగాయకులు ఎవరంటే..
Surya Kala
|

Updated on: Feb 27, 2021 | 9:37 PM

Share

Telugu contestants in Indian Idol : కళకు, గాత్రానికి ఎల్లలు లేవు.. భాషాబేధం లేదు.. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసిని ఇండియన్ ఐడల్ షో.. పాప్ ఐడల్ ను మన దేశంలో సోని ఎంటర్టైన్మెంట్ ఇండియన్ ఐడల్ గా దేశీ వెర్షన్ గా 2004 లో తీసుకుని వచ్చింది. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రతిభావంతులైన గాయకులు వెలుగులోకి వస్తున్నారు. సంగీతంలో ఉన్న తమ ప్రతిభను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నారు. అయితే ఈ ఇండియన్ ఐడల్ సీజన్లలో అనేకమంది తెలుగు గాయనీగాయకులు తమ సామర్ధ్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఈ రియాలిటీ షో యొక్క తాజా సీజన్ కూడా దీనికి మినహాయింపు కాదు. వైజాగ్ నుండి వచ్చిన షణ్ముఖ ప్రియా, శిరీష భాగవతుల ఇద్దరూ తమవిలక్షణమైన గాత్రంతో సమ్మొనహమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన సంగీత ప్రదర్శన షోలో ఇప్పటి వరకూ ప్రకాశించిన తెలుగుగాయనీగాయకులు గురించి ఈ రోజు తెలుసుకుందాం..!

1 ఎన్‌సి కరుణ్య

బుల్లి తెరపై అత్యంత ప్రతిష్టాత్మక షో ఇండియన్ ఐడల్ లో తెలుగు గాయనీగాయకులు కూడా పాల్గొనడానికి మార్గం ఏర్పరచింది కారుణ్య. ఇండియన్ ఐడల్ రెండవ సీజన్లో రన్నరప్ గా నిలిచాడు. తన గానంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. తెలుగులో అనేక సినిమాల్లో కారుణ్య పాటలను పాడుతున్నడు. ఇక ఆ సీజన్ లో సందీప్ ఆచార్య టైటిల్‌ను విన్నర్ నిలిచాడు.

# 2 శ్రీరామ చంద్ర మైనంపాటి

శ్రీ రామ చంద్ర ఇండియన్ ఐడల్ లో పాల్గొనక ముందు తెలుగు సినిమాల్లోని పలు సాంగ్స్ కు ట్రాక్ సింగర్ గా పనిచేశాడు. అష్టా చమ్మ వంటి అనేక సినిమాల్లోని ట్రాక్‌తో సహా కొన్ని తెలుగు పాటలు పాడారు. ఇండియన్ ఐడల్ విజేతగా టైటిల్ గెలుచుకున్న తరువాత శ్రీరామ చంద్ర టాలీవుడ్, బాలీవుడ్ లో పలు అవకాశాలను అందుకున్నాడు. సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడాడు.

# 3 ఎల్వి రేవంత్ బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమాలో మనోహరి సాంగ్ కు ట్రాక్ ను పాడి అందరి దృష్టిని ఆకర్షించాడు రేవంత్. అనంతరం 2017 లో ఇండియన్ ఐడల్ 9 లో పాల్గొన్నాడు. ఆ సీజన్ విన్నర్ గా నిలిచి సంగీత ప్రేమికుల మనసును దోచాడు. వైజాగ్‌కు చెందిన రేవంత్ తెలుగు, కన్నడ చిత్రాల్లో పలు పాటలు పాడారు.

# 4 పివిఎన్ఎస్ రోహిత్

ఇండియన్ ఐడల్ 9 లో రేవంత్ తో పాటు పాల్గొన్న మరో తెలుగు గాయకుడు పివిఎన్ఎస్ రోహిత్. పాపులర్ సింగర్ సుఖ్వీందర్ సింగ్ కు రోహిత్ ను తన గాత్రంతో ఆకట్టుకున్నాడు. పివిఎన్ఎస్ రోహిత్ ఇండియన్ ఐడల్ 9 లో టాప్ 3 లో చోటు దక్కించుకున్నాడు.

# 5 షణ్ముఖ ప్రియా

ప్రస్తుతం ఇండియన్ ఐడల్ 12 టైటిల్ కోసం పోటీ పడుతున్న వైజాగ్‌కు చెందిన పదిహేడేళ్ల బాలిక షణ్ముఖ ప్రియ. ఆమె అసాధారణమైన యోడెల్లింగ్ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఐదేళ్ల వయస్సు నుండే పలు షోల్లో పాల్గొన్న షణ్ముఖ ప్రియ జీ సరిగమ లిటిల్ చాంప్స్ 2017 లో ఫైనలిస్ట్.

# 6 శిరీషా భాగవతుల

ఇండియన్ ఐడల్ 12 లో మరో తెలుగింటి అమ్మాయి శిరీషా భాగవతుల. చిత్ర జీ అనే ముద్దు ప్రేమతో పిలుచుకునే శిరీష పేమస్ అయ్యింది. శ్రావ్యమైన శిరీష రం చిత్ర ని గుర్తు చేస్తుందని న్యాయనిర్ణేతలు అంటారు. 21 ఏళ్ల ఈ ఇంజనీర్ తన గానంతో న్యాయనిర్ణేతలు అలరిస్తుంది.

Also Read:

పైన పటారం లోన లొటారం.. వినరా చెబుతా లోకం తీరు అంటున్న యాంకర్ అనసూయ

 కార్తీక దీపంలో తల్లికొడుకులైన కార్తీక్, సౌందర్యల మధ్య నిజజీవితంలో వయసు బేధం తెలిస్తే తెలిస్తే షాక్..!

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..