Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hari Nadar As Hero: ఈ గోల్డ్ మ్యాన్ హీరోగా మారాడు.. హీరోయిన్‌ ఎవరో తెలిస్తే షాకవుతారు…

ప్రఖ్యాత ఏవిఎం స్టూడియో లో కొత్త సినిమా పూజ కార్యక్రమం జరిగింది.  ఈ సినిమా ద్వారా ఓ కొత్త వ్యక్తి హీరోగా అరంగేట్రం చేయబోతున్నారు. హా.. ఇలాంటి ఓపెనింగ్స్ రోజూ బోలెడ్ జరుగుతాయి.

Hari Nadar As Hero: ఈ గోల్డ్ మ్యాన్ హీరోగా మారాడు.. హీరోయిన్‌ ఎవరో తెలిస్తే షాకవుతారు...
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 28, 2021 | 6:13 PM

Hari Nadar As Hero:  ప్రఖ్యాత ఏవిఎం స్టూడియో లో కొత్త సినిమా పూజ కార్యక్రమం జరిగింది.  ఈ సినిమా ద్వారా ఓ కొత్త వ్యక్తి హీరోగా అరంగేట్రం చేయబోతున్నారు. హా.. ఇలాంటి ఓపెనింగ్స్ రోజూ బోలెడ్ జరుగుతాయి. ఇందులో స్పెషల్ ఏంటి అనకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం. పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే  హీరో.  కొత్త హీరో ఈ వేషధారణతో ఎంట్రీ ఇవ్వడంతో అక్కడకు వచ్చిన  పలువురు సినీ ప్రముఖులు అవాక్కయ్యారు. హీరో ఆరడుగుల ఎత్తు ఉన్నాడని కాదండోయ్. ఒంటినిండా ఆరు కిలోల బంగారంతో ప్రత్యక్షమయ్యాడని. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన నూతన హీరో గోల్డ్ మాన్ హరి నాడార్ గురించి తెలుసుకుందాం పదండి.

తమిళనాడులో నాడార్ క్యాస్ట్ బలమైన సామజిక వర్గంగా ఉంది. దక్షిణ తమిళనాడుకి చెందిన హరి నాడార్ అదే సామాజికవర్గానికి చెందినవాడు. నాడార్ వర్గం రాజకీయంగా బలోపేతం కోసం నాడార్ పెరవై పేరుతో ఇతను పోరాడుతున్నాడు. ఈ మధ్యకాలం లో యూట్యూబ్ లో ఆయన వీడియోలు వైరల్ అవ్వడంతో సినిమా హీరో అవ్వాలని ఫిక్సయ్యారు. ఇంకెందుకు ఆలస్యం అని  ( 2K / అలగనాదు కాదల్) పేరుతో చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. ఏవిఎం స్టూడియో లో జరిగిన సినిమా పూజ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత ఆర్ బి చౌదరి హాజరుకాగా.. ఒంటినిండా ఆరు కిలోల బంగారం ధరించి పూజ కార్యక్రమానికి హరి నాడార్ రావడంతో అందరూ అవాక్కయ్యారు. ప్రముఖ నటి వనిత హరి నాడార్‌కు జతగా నటించనుంది.  పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారని తప్పకుండా ఈ చిత్రం విజయవంతం సాధిస్తుందని హరి నాడార్ ధీమా వ్యక్తం చేసారు.

సినిమా విషయాలు పక్కనపెడితే ఒక రాజకీయ నాయకుడు హీరోగా మారడం, ఒంటినిండా బంగారం నగలు ధరించి, తన నాడార్ సామజిక వర్గం గురించి అందరికి తెలిసేలా నాడార్ పేరు తో బంగారు శిలా ఫలకంతో హల్‌చల్ చేయడం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.

Also Read:

లైంగిక శక్తి పెరుగుతుందని, వీర్యపుష్టి కలుగుతుందని ప్రచారం.. ఏపీలో గాడిదలు కనుమరుగు

దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్‌ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు