Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ ఎక్కడ, ఎంత ఉందంటే..

Gold Price Today: వివాహాది శుభకార్యక్రమాల కోసం బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటోన్న వారికి బహుశా ఇదే సరైన సమయంలా కనిపిస్తోంది. రోజురోజుకీ తగ్గుతోన్న బంగారం ధరలే దీనికి కారణంగా చెప్పవచ్చు...

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ ఎక్కడ, ఎంత ఉందంటే..
Follow us

|

Updated on: Feb 28, 2021 | 8:15 AM

Gold Price Today: వివాహాది శుభకార్యక్రమాల కోసం బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటోన్న వారికి బహుశా ఇదే సరైన సమయంలా కనిపిస్తోంది. రోజురోజుకీ తగ్గుతోన్న బంగారం ధరలే దీనికి కారణంగా చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, బంగారం కొనుగోలు తగ్గడం కారణం ఏదైనా గోల్డ్‌ ధరలు భారీగా తగ్గుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఒకానొక స్థాయిలో తులం బంగారం ఏకంగా రూ. యాభై వేలు దాటిన పరిస్థితులు కూడా చూశాం. అయితే ప్రస్తుతం గోల్డ్‌ ధరలు భారీగా పడిపోతున్నాయి. ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర రూ.44,850 ఉండగా (శనివారం రూ.45,540), 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,930వద్ద (శనివారం రూ.49,680) ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,940 ఉండగా (శనివారం రూ.45,740), 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.45,940 వద్ద (శనివారం రూ.46,740) కొనసాగుతోంది. ఇక దక్షిణ భారతదేశం విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,700 ఉండగా (శనివారం రూ.43,250), 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,580 వద్ద ( శనివారం రూ.47,180) వద్ద కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.42,700 ఉండగా (శనివారం రూ.43,250), 24 క్యారెట్ల బంగారం రూ.46,580 వద్ద ( శనివారం రూ.47,180) ఉంది. సాగరతీరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.42,700 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,580గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రామలు గోల్డ్‌ ధర రూ.43,310 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,250 వద్ద కొనసాగుతోంది.

Also Read: ఈ పబ్లిక్ బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా..? అయితే నగదు లావాదేవీల్లో ఇబ్బందులు తప్పవు.. వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించండి..

Credit Card: మీ వద్ద ఈ క్రెడిట్ కార్డ్ ఉందా? అయితే పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై రాయితీ పొందొచ్చు..!