AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top 10 Two-Wheelers: దేశంలో టాప్ 10 ద్విచక్ర వాహనాలు ఇవే, అమ్మకాల గణాంకాలు ఇలా ఉన్నాయి..

Top Selling Two Wheelers:ఈ ఏడాది జనవరిలో దేశంలోని టాప్ టెన్ ద్విచక్ర వాహనాల జాబితాలో హీరో మోటోకార్ప్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ద్విచక్ర వాహనాల తయారీదారుల ఎంట్రీ..

Top 10 Two-Wheelers: దేశంలో టాప్ 10 ద్విచక్ర వాహనాలు ఇవే, అమ్మకాల గణాంకాలు ఇలా ఉన్నాయి..
Top 10 two-wheelers sold in India
Sanjay Kasula
|

Updated on: Feb 28, 2021 | 2:27 PM

Share

India Two-Wheeler Sales 2021: ఈ ఏడాది జనవరిలో దేశంలోని టాప్ టెన్ ద్విచక్ర వాహనాల జాబితాలో హీరో మోటోకార్ప్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ద్విచక్ర వాహనాల తయారీదారుల ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ మోటారు సైకిల్ స్ప్లెండర్ క్యాలెండర్ సంవత్సరంలో మొదటి నెలలో అమ్మకాల విషయంలో అగ్రస్థానంలో ఉంది. దేశంలో ఉత్తమ స్కూటర్ అయిన హోండా యాక్టివా రెండవ స్థానంలో ఉంది.

Top-Selling Two-Wheeler Brands

హీరో ..

జనవరి 2021లో 2,25,382 యూనిట్ల హీరో స్ప్లెండర్ కమ్యూటర్ మోటార్ సైకిళ్ళు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో హీరో 2,22,572 యూనిట్ల స్ప్లెండర్‌ను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 1.26 శాతం పెరుగుదల కనిపించింది.

హోండా..

మరోవైపు, హోండా గత నెలలో యాక్టివా స్కూటర్ యొక్క 2,11,660 యూనిట్లు విక్రయించింది. 2020 జనవరిలో అమ్మిన 234,749 యూనిట్లతో పోల్చితే ఈ ఏడాది 9.84% తగ్గింది.

కరోనా మహమ్మారి నుండి ద్విచక్ర వాహన విభాగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎంట్రీ లెవల్ సబ్ సెగ్మెంట్ ద్విచక్ర వాహనాల అమ్మకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. హీరో మోటోకార్ప్ యొక్క ప్రయాణికుల మోటారుసైకిల్, హెచ్ఎఫ్ డీలక్స్ గత నెలలో 1,34,860 యూనిట్ల అమ్మకాలతో దేశంలో మూడవ స్థానంలో ఉంది. హెచ్‌ఎఫ్ డీలక్స్ గత ఏడాది జనవరిలో 1,91,875 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది అమ్మకాలు 29.71% తగ్గాయి.

నాల్గవ స్థానంలో బజాజ్ పల్సర్

జనవరి 2021 లో టాప్ 10 ద్విచక్ర వాహనాల జాబితాలో బజాజ్ పల్సర్, హోండా సిబి షైన్, యాక్సెస్, టివిఎస్ ఎక్స్ఎల్ సూపర్, సిటి, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు గ్లామర్ ఉన్నాయి. ఈ బైక్‌లు వరుసగా 4 నుండి 10 వ స్థానంలో ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 500 సిసి మోడల్ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌గా నిలిచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో 40,875 యూనిట్లను విక్రయించింది. 2020 జనవరిలో 40,834 యూనిట్ల నుండి 0.10% పెరిగింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్థానం అలాగే ..

2021 జనవరిలో టాప్ 10 ద్విచక్ర వాహనాల అమ్మకాలు 10,26,175 యూనిట్లు కాగా, గత ఏడాది ఇదే నెలలో 9,82,035 యూనిట్లు. అంటే 4.49% పెరుగుదల కనిపించింది. 39.31% మార్కెట్ వాటాతో టాప్ 10 ద్విచక్ర వాహనాల జాబితాలో హీరో మోటోకార్ప్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు, వారు స్కూటర్లు,  ప్రీమియం మోటార్ సైకిళ్లపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. హార్లే-డేవిడ్సన్‌తో భాగస్వామ్యం తరువాత హీరో అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచన వేస్తున్నారు .

ఇవి కూడా చదవండి

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి అన్ని ఆర్జిత సేవలు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఇలాంటి ఎస్ఎంఎస్ మీ ఫోన్‌కు వస్తే జాగ్రత్త.. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయండి..