AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి అన్ని ఆర్జిత సేవలు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి

arjitha sevas: ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి..

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి అన్ని ఆర్జిత సేవలు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి
Sanjay Kasula
|

Updated on: Feb 27, 2021 | 10:26 PM

Share

Tirumala Tirupati Devasthanams: ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి.. కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల కోరికతో తిరుచానూరు ఆలయంలో కూడా టీటీడీ మాదిరిగానే తులాభారం ప్రారంభించాలని నిర్ణయించింది.

తిరుమల పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడేందుకు గ్రీన్‌ పవర్‌కి ప్రాధాన్యమివ్వాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇప్పుడున్న 20 మెగావాట్లకు తోడు.. దశలవారీగా 30మెగావాట్లదాకా సోలార్‌, విండ్‌పవర్‌ ఉత్పత్తి చేసుకోబోతోంది టీటీడీ. గ్రీన్‌పవర్‌ పూర్తిగా అందుబాటులోకొచ్చేలోగా..కొండపై విద్యుత్‌ వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకోబోతోంది.

టీటీడీ బోర్డు సభ్యుడు, యుగతులసి ఫౌండేషన్‌చైర్మన్‌ శివకుమార్‌ కొన్నాళ్లుగా గోసంరక్షణ కోసం సాగిస్తున్న ఉద్యమంపై టీటీడీ పాలకమండలి స్పందించింది. గోమాతని జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. కేంద్రానికి ఈ తీర్మానాన్ని పంపుతున్నట్లు టీటీడీ పాలకమండలి ప్రకటించింది.

ఇది గోబంధువుల విజయమని స్పందించారు.. యుగతులసి ఫౌండేషన్‌ చైర్మన్‌, టీటీడీ బోర్డు సభ్యుడు శివకుమార్‌. గోవుల అక్రమ తరలింపును ఆపాలని, గోవధను పూర్తిగా నిషేధించాలని కోరుతూ యుగతులసి ఫౌండేషన్‌ కొన్నాళ్లుగా ఉద్యమరూపంలో కార్యక్రమాలు చేపడుతోంది. వెంకన్నసాక్షిగా టీటీడీ బోర్డు కూడా తీర్మానంతో మద్దతు పలికింది.

ఆలయాల టేకోవర్‌తో పాటు… కళ్యాణమండపాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించింది టీటీడీ బోర్డు. లీజులకిచ్చి ప్రైవేట్‌ ఏజెన్సీలతో కళ్యాణమండపాల నిర్వహణని మెరుగుపరచాలని నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగులకు త్వరలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు పాలకమండలి నిర్ణయించింది. శ్రీవారి మెట్టుమార్గంలో అన్నదానానికి నిర్ణయించారు.

టీటీడీ వేదపాఠశాలలన్నింటినీ ఇకపై ఎస్వీ వేద విజ్ఙానపీఠంగా మారుస్తున్నారు. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు 9కోట్లు కేటాయిస్తూ టీటీడీ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలోనూ… ఏడుకొండలవాడి ఆలయం కోసం స్థలం కోరాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి..

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఇలాంటి ఎస్ఎంఎస్ మీ ఫోన్‌కు వస్తే జాగ్రత్త.. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయండి..

ఉద్యోగం మారిన ప్రతిసారి కొత్త అకౌంట్ తీసుకుంటున్నారా.. అయితే మీరు ఇవి తప్పకుండా పాటించాలి…

తమిళనాట మూడో కూత మొదలైంది.. కో అంటే కొక్కొరొకో అంటున్న మనసు పడ్డ నేతలు.. ఎవరిని వరిస్తుందో అదృష్ట దేవత..