తమిళనాట మూడో కూత మొదలైంది.. కో అంటే కొక్కొరొకో అంటున్న మనసు పడ్డ నేతలు.. ఎవరిని వరిస్తుందో అదృష్ట దేవత..
తమిళనాడు రాజకీయం ఇప్పటికే అర్ధంకాని అరవసిన్మాలా ఉంటే...ఇంకో ఫ్రంట్‌కి రెడీ అయ్యాడు దశావతారం. ఇన్నాళ్లూ కాస్త సైలెంట్‌గా ఉన్నా కమల్‌హాసన్..ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అంటూ గర్జిస్తున్నారు.
MNM Hopes to Lead Third Front: తమిళనాడు రాజకీయం ఇప్పటికే అర్ధంకాని అరవసిన్మాలా ఉంటే…ఇంకో ఫ్రంట్‌కి రెడీ అయ్యాడు దశావతారం. ఇన్నాళ్లూ కాస్త సైలెంట్‌గా ఉన్నా కమల్‌హాసన్..ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అంటూ గర్జిస్తున్నారు. శరత్ కుమార్ కూడా కమల్‌కు జత కలిశారు. ఐజేకే పేరుతో మరో పార్టీ కూడా వీళ్ళకు చేయందించింది. ఎంఎన్ఎం( MNM) వ్యవస్థాపకుడు కమల్, ఏఐఎస్ఎంకే (AISMK) చీఫ్, నటుడు శరత్ కుమార్, ఐజెకె నేతలతో తన నివాసంలో చర్చలు జరిపారు కమల్‌హాసన్. సీఎం క్యాండేట్‌ని తానేనని ప్రకటించేసుకున్నారు.
డీఎంకే, అన్నాడీఎంకే కూటముల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించేందుకు కమల్ సిద్దమయ్యారు. 2011నుంచి శరత్ కుమార్ ఏఐఎస్ఎంకే (AISMK) పార్టీ అన్నాడీఎంకే కూటమితో కొనసాగుతూ వచ్చింది. ఐజెకెకు చెందిన టిఆర్ పరివేందర్ 2019 పార్లమెంటు ఎన్నికలలో డీఎంకె కూటమి తరఫున గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎవరూ సీట్లు ఇవ్వకపోవడంతో ఆయా కూటముల మూడో కూటమి వైపు మొగ్గారు.
మక్కళ్ నీది మయ్యం ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధమన్నారు కమల్ హాసన్. శరత్ కుమార్‌తో చర్చలు జరుగుతున్నాయని.. తప్పకుండా బలమైన కూటమిగా ఏర్పడి… ఎన్నికల బరిలో తలపడతామంటున్నారు. ఏ పార్టీ వచ్చినా థర్డ్ ఫ్రంట్‌లోకి ఆహ్వానిస్తామన్నారు కమల్. మార్చి 1 నుంచి పోటీకి ముందుకొచ్చే అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. మార్చి 7 న అభ్యర్థుల తొలిజాబితా విడుదలకు కమల్‌హాసన్ సిద్ధమవుతున్నారు.
కమల్ హాసన్‌తో సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన శరత్ కుమార్, మంచి ఉద్దేశాలు , బలమైన సిద్ధాంతాలు ఉన్న కమల్ పార్టీతో కూటమి ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎంఎన్ఎం-ఏజెకే-ఏఐఎస్ఎంకె( MNM-IJK-AISMK) కూటమిలో ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికల్లో విజయం తర్వాత నిర్ణయిస్తామన్నారు. ఓ పక్క బీజేపీతో కలిసి అన్నాడీఎంకే.. మరోవైపు కలిసొచ్చే పార్టీలతో డీఎంకే. అటు శశికళ పార్టీ తనదైన వ్యూహంతో చక్రం తిప్పుతోంది. ఈ టైంలో తమిళనాడులో థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటుతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది విశ్లేషకుల వాదన.
సిన్మా నటులమీద అభిమానంతో ఓట్లేసే పరిస్థితి ఇప్పుడు లేదంటున్నారు… సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఫ్యాన్స్‌తో త్వరతో మీటింగ్‌లకు రెడీ అవుతున్నారు. రాజకీయాల నుంచి రిటైర్డ్ హర్ట్ అయిన రజినీకాంత్ ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటారోనన్నది తమిళనాట అందరికీ ఆసక్తిగానే ఉంది.