AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: పందెం గెలిచేదెవరు…? ప్రతిపక్షంలో కూర్చొనేది ఎవరు… ? తమిళ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్..

తమిళనాట ఎన్నికల భేరీ మోగింది. ద్రవిడ పార్టీలకు రేస్ మొదలైంది. జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలపైను దేశం ఫోకస్. డీఎంకే వారసుడిగా స్టాలిన్ టాలెంట్ నిరూపించుకుంటారా...

Tamil Nadu: పందెం గెలిచేదెవరు...?  ప్రతిపక్షంలో కూర్చొనేది ఎవరు... ? తమిళ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్..
Sanjay Kasula
|

Updated on: Feb 27, 2021 | 10:45 PM

Share

First Elections in Tamil Nadu : తమిళనాట ఎన్నికల భేరీ మోగింది. ద్రవిడ పార్టీలకు రేస్ మొదలైంది. జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలపైను దేశం ఫోకస్. డీఎంకే వారసుడిగా స్టాలిన్ టాలెంట్ నిరూపించుకుంటారా… అన్నాఎండీకే, బీజేపీ పొత్తును తమిళఓటర్లు ఎలా స్వీకరిస్తారు… శశికళ ఏమైనా ట్విస్టులు ఇస్తారా… కమల్‌ థర్డ్‌ ఫ్రంట్‌ ఎవరి ఓట్లు చీల్చుతుందనే డిబేట్‌ స్టార్ట్‌ అయింది. ఈ ఓట్ల పందెంలో గెలిచేదెవరు… ప్రతిపక్షంలో కూర్చొనేది ఎవరు… ? ప్రస్తుతం నెలకొన్న వాక్యూమ్‌ ఫుల్‌ఫిల్‌ చేసే సత్తా ఎవరికి ఉంది.

తమిళనాడు అంటేనే ప్రతీకార రాజకీయాలకు అడ్డా. రాజకీయ స్టాల్‌వాల్ట్ కామరాజ్‌నాడార్ నుంచి మొన్నటి జయలలిత వరకు అందరిదీ అదే రాజకీయం. వాళ్ల రాజకీయ స్టైలే వేరు. కామరాజ్‌, అన్నాదురై, ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలిత వీళ్లందరికీ పిచ్చ మాస్ పాలోయింగ్. జయలలిత, కరుణానిధి మరణం తర్వాత… పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వీళ్ల సరసన నిలిచే లీడర్‌ ప్రస్తుత ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. అందుకే ఈ ఎన్నికలకు అంత స్పెషల్. ఇప్పటికిప్పుడు ఎవరు గెలుస్తారన్న దానిపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో పోటీ రసవత్తంగా మారింది.

1967 నుంచి 2016 వరకు ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే అధికారం ఉంది. కరుణా నిధి, జయలలిత ఇద్దరూ ఇద్దరే అన్నట్టు… రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ప్రతీకార రాజకీయాలతో మూడో పార్టీకే ఛాన్స్ ఇవ్వలేదు. అటు కేంద్రంలో తమ స్ట్లైల్‌లో చక్రం తిప్పారు. కానీ వాళ్లు ఇప్పుడు లేరు. వాళ్ల స్థాయి రాజకీయ చతురత, టాలెంట్ ఉన్న నాయకులు ఈ ఎన్నికల్లో ఎమర్జ్‌ అవుతారా… లేకుంటే జాతీయ పార్టీకి ఒక్క ఛాన్స్ ఏమైనా ఇస్తారా అనే సస్పెన్ష్‌ కొనసాగుతోంది.

232 స్థానాలు ఉన్న తమిళనాడులో 2016లో జరిగిన ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే 136 స్థానాల్లో విజయం సాధించింది. జయలలిత రెండోసారి సీఎం పీఠం దక్కించుకున్నారు. డీఎంకే 88 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ పార్టీ 8 స్థానాలకు పరిమితమైంది. 188 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.

అధికారం చేపట్టిన ఏడాది కాకుండానే జయలలిత మరణం తమిళనాడు పాలిటిక్స్‌ను మార్చేసింది. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీ వర్గాలుగా చీలిపోయింది. కె పలణిస్వామి, పన్నీరు సెల్వం, శశికళ వర్గాలుగా విడిపోయి ప్రభుత్వం కూలిపోతుందా అనే స్థాయికి తీసుకొచ్చారు. శశికళ జైలుకు వెళ్లాక ప్రభుత్వంలో స్థిరత్వం వచ్చింది. ఇప్పుడు ఇదే ప్రత్యర్థులకు అవకాశంగా మారింది. 2019 ఎన్నికల్లో డీఎంకే ఓటు బ్యాంకును బాగా పెంచుకుంది. అదే కాన్పిడెన్స్‌తో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పోటీకి సిద్ధమైంది.

ఎప్పటి నుంచి తమిళనాడుపై కన్నేసిన ఈసారి ఎలాగైనా అధికారం సాధించాలని అనేక రకాలుగా ట్రై చేస్తోంది బీజేపీ. ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు అన్నట్టు… లోకల్‌ పార్టీతో పొత్తు పెట్టుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కాషాయ దళం. 1951, 1957, 1962లో వరుసుగా మూడుసార్లు గెలిచి రికార్డు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అలాంటి అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. ఎన్ని విధాలుగా ట్రై చేసినా.. కాంగ్రెస్ అదృష్ట రేఖలు మాత్రం మారడం లేదు. ఇప్పుడైనా మారుతాయేమనని ఆ పార్టీ నేతలు శ్రమిస్తున్నారు.

పార్టీ పెట్టి ఏళ్లు గడుస్తున్న ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోయిన కమల్‌ హాసన్ థర్డ్‌ ఫ్రంట్‌ను తమిళ తెరపైకి తీసుకొచ్చారు. ఆయనకు మరో నటుడు, ఏఐఎస్‌ఎంకే చీఫ్‌ శరత్‌కుమార్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ థర్డ్‌ ఫ్రంట్‌ ప్రభావం ఏమేరకు ఉంటుందన్న విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. మధ్యలోనే రాజకీయాలను వదిలేసిన రజనీకాంత్‌ మరోసారి యాక్టివ్‌ అయ్యే ప్లాన్ చేస్తున్నారు. అభిమాన సంఘాలతో మీటింగ్‌ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఏ టర్న తీసుకుంటారన్న చర్చ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఇలాంటి ఎస్ఎంఎస్ మీ ఫోన్‌కు వస్తే జాగ్రత్త.. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయండి..

ఉద్యోగం మారిన ప్రతిసారి కొత్త అకౌంట్ తీసుకుంటున్నారా.. అయితే మీరు ఇవి తప్పకుండా పాటించాలి…