AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఇలాంటి ఎస్ఎంఎస్ మీ ఫోన్‌కు వస్తే జాగ్రత్త.. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయండి..

SBI Warns: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారుల భద్రత కోసం కొన్ని ముఖ్యమైన సెక్యూరిటీ టిప్స్ చెప్పింది.

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఇలాంటి ఎస్ఎంఎస్ మీ ఫోన్‌కు వస్తే జాగ్రత్త.. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయండి..
SBI Alert
Sanjay Kasula
|

Updated on: Feb 27, 2021 | 4:38 PM

Share

SBI Tips and Be Alert: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారుల భద్రత కోసం కొన్ని ముఖ్యమైన సెక్యూరిటీ టిప్స్ చెప్పింది. తమ బ్యాంక్ ఖాతా ఉందా? ఇందులో మీకు ఖాతా ఉందా..? అయితే ఇది మీ కోసమే. తమ వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన హెచ్చరిక జారీచేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చదవండి… ఖచ్చితంగా పాటించండి.

ఎస్‌బిఐ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వినియోగదారులను హెచ్చరించింది. మీకు తెలియని వ్యక్తుల ద్వారా యుపిఐకు ఖాతాకు డబ్బులు డెబిట్ చేయమని  ఎస్ఎంఎస్ వస్తే అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ తెలిపింది. ఎస్‌బీఐ తన లక్షలాది మంది కస్టమర్లను ట్వీట్ చేయడం ద్వారా అప్రమత్తం చేసింది. మీకు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ కానీ ఎస్ఎంఎస్ వస్తే జాగ్రత్తగా ఉండమని సూచించింది. యుపిఐ ద్వారా ఖాతా నుండి డబ్బు డెబిట్ చేయమని మీకు ఎస్ఎంఎస్ హెచ్చరిక వస్తే అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ పేర్కొంది. భారత్‌లో తమకున్న 44 కోట్ల మంది ఖాతాదారులకు తమ ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది. వినియోగదారులు యూపీఐ మోసాల గురించి తెలుసుకోవాలని హెచ్చరించింది.

మోసపూరితమైన.. తప్పుడు ఎస్ఎంఎస్‌లు

మొబైల్ ఫోన్ తెరిస్తే చాలు అందులో ఎన్నో ఎస్ఎంఎస్‌లు ఏంటున్నాయి. బ్యాంక్‌కు సంబంధించి కుప్పలు తెప్పులుగా ఎస్ఎంఎస్‌లు వస్తుంటాయి. పర్సనల్ లోన్ కావాంటే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. క్రిడిట్ కార్డును పొందాలంటే ఇలా చేయండి..? మీ క్రెడిట్ లిమిట్ తెలుసుకోవాలంటే ఇలా చేస్తే సరిపోతుంది..? మీ బ్యాంక్ సమాచారం మీరు ఇలా తెలుసు కోవచ్చు.. అంటూ ఈ కింద ఉన్న బ్లూ లింక్ క్లిక్ చేయండి… అని దర్శనమిస్తాయి.

అయితే అలాంటి ఎస్ఎంఎస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ తమ కస్టమర్లను హెచ్చరించింది. ఎస్‌బీఐ యాప్స్ పేరిట వచ్చే మోసపూరితమైన లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయవద్దని స్పష్టం చేసింది.

అనధికారిక లింక్కులను క్లిక్ చేయవద్దని.. అందులలో తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేయవద్దని కస్టమర్లకు ఎస్‌బీఐ తెలిపింది. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నందున ఎస్‌బిఐ ఎప్పటికప్పుడు వినియోగదారులను అప్రమత్తం చేస్తోది. అలా చేస్తే మీ ఖాతాలోని డబ్బులను మోసగాళ్లు మాయం చేసే అవకాశముందని హెచ్చరించింది.

మీకు పర్సనల్ లోన్ కావాలా…

పర్సనల్ లోన్స్ కావాలనుకునే వారు నేరుగా మీకు సమీపంలోని  ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి అక్కడి అధికారులను సంప్రదించాలి. సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి. బ్యాంక్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటే లోన్ బ్యాంక్ అధికారులు అన్నింటిని నిర్ధారించి మీకు రుణంను మంజూరు చేస్తారు. బ్యాంక్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటే లోన్ చాలా ఈజీగా  మీకు లభిస్తుంది. లోన్స్‌కి సంబంధించి పూర్తి సమాచారం కావాలంటే మాత్రం ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ను కాని గూగుల్ ప్లే స్టోర్ నుంచి యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందుబాటులోని సమాచారం ఆదారంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అయినా మీకేమైనా డౌట్స్ ఉంటే ఎస్‌బీఐ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి తెలుసుకోవాలి.

యుపిఐ సేవను ఎలా డిసేబుల్ చేయాలి

యుపిఐ సేవను ఆపడానికి బ్యాంక్ చిట్కాలు ఇచ్చింది. టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1800111109 కు కాల్ చేసి యూపీఐ సేవను వినియోగదారులు ఆపవచ్చు. లేదా మీరు IVR నంబర్ 1800-425-3800 / 1800-11-2211 కు కూడా కాల్ చేయవచ్చు.

ఇది కాకుండా, మీరు మీ ఫిర్యాదును https://cms.onlinesbi.sbi.com/cms/ లో ​​ఇవ్వవచ్చు. అక్కడే 9223008333 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపవచ్చు.

ఇవి కూడా చదవండి: 

SBI Deposit Scheme: ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. ఇలా చేయండి.. నెలకు 10 వేలు పొందండి..

Coronavirus: ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి.. తస్మాత్ జాగ్రత్త