Coronavirus: ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి.. తస్మాత్ జాగ్రత్త

Coronavirus in Maharashtra: దేశంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో తీవ్రంగా విస్తరిస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 36  జిల్లాల్లో 28 జిల్లాల్లో డైలీ నమోదయ్యే కరోనా వైరస్ కేసులు..

Coronavirus: ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి.. తస్మాత్ జాగ్రత్త
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 27, 2021 | 4:13 PM

దేశంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో తీవ్రంగా విస్తరిస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 36  జిల్లాల్లో 28 జిల్లాల్లో డైలీ నమోదయ్యే కరోనా వైరస్ కేసులు గత రెండు వారాల్లో పెద్ద మొత్తంలో పెరిగింది. గత 10 రోజుల్లోనే మహమ్మారి వేగం మరింత పెరిగింది. మరాఠ్వాడ ప్రాంతంలోని లాతూర్, హింగోలి, పర్భాని, నాందేడ్ జిల్లాలు పెద్ద సంఖ్యలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఆరోగ్య శాఖ యొక్క డేటా రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరిగినట్లు స్పష్టంగా సూచిస్తుంది. విదర్భ, అమరావతి, అకోలా, యావత్మల్‌ ప్రాంతాలను కొత్త హాట్‌స్పాట్లగా గుర్తించారు అధికారులు. 

తాజా కేసులతో కలిపి చూస్తూ విదర్బ ఫిబ్రవరి నుంచి వ్యాధి వ్యాప్తికి కేంద్రంగా మారింది. తరువాత నాగ్పూర్, పూణే, ముంబై, థానే, అమరావతిలో వ్యాధి వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఈ ఐదు జిల్లాల్లోని యాక్టీవ్ కేసులు  మహారాష్ట్రలో మొత్తం యాక్టీవ్ కేసుల్లో దాదాపు 65 శాతం ఉన్నాయి. 13 మిలియన్ల జనాభా ఉన్న ముంబైతో పోలిస్తే నాగ్‌పూర్‌లో 5 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్న కేసులు ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా, అమరావతిలో రాష్ట్రంలో అత్యధికంగా 41.5 శాతం పాజిటివిటీ రేటు ఉంది.

శుక్రవారం, ముంబైలో కోవిడ్ -19 సంఖ్య 1,034 పెరిగి 3,23,877 కు చేరుకోగా, కొత్తగా మూడు మరణాలు సంభవించినట్లు ఆరోగ్య శాాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,461 కు చేరుకున్నాయని ఒక అధికారి తెలిపారు. నగరంలో వరుసగా మూడవ రోజు 1,000కి పైగా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, బుధవారం, గురువారం వరుసగా 1,145 మరియు 1,167 కేసులు నమోదయ్యాయి. 

ఏది ఏమైనా వ్యాధి తీవ్రత మరోసారి దేశవ్యాప్తంగా గుబులు రేపుతుంది. ఈ క్రమంలో ఆరోగ్య నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. వెరస్‌ను లైట్ తీసుకోవద్దని.. భౌతిక దూరం, మాస్క్ ధరించడం తప్పనిసరి అని చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించని పక్షంలో మరోసారి పాత రోజులను చూడాల్సి వస్తుందని వారి వార్నింగ్. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ అశ్రద్ద వహించడం కరెక్ట్ కాదన్నది నిపుణులు వాదన. సో బీ కేర్‌ఫుల్.

Also Read:

Crime News: ఎన్నారైలే టార్గెట్‌… నెల్లూరు నుంచే ఆపరేషన్… ప్రొఫైల్‌లో అందమైన ఫొటోలు… గొంతు మార్చి..

Crime News: ఎన్నారైలే టార్గెట్‌… నెల్లూరు నుంచే ఆపరేషన్… ప్రొఫైల్‌లో అందమైన ఫొటోలు… గొంతు మార్చి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే