AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: మీ వద్ద ఈ క్రెడిట్ కార్డ్ ఉందా? అయితే పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై రాయితీ పొందొచ్చు..!

SBI - Indian Oil Credit Card: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరుసగా పెరుగుతున్న ధరలను చూసి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

Credit Card: మీ వద్ద ఈ క్రెడిట్ కార్డ్ ఉందా? అయితే పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై రాయితీ పొందొచ్చు..!
Shiva Prajapati
|

Updated on: Feb 27, 2021 | 7:37 PM

Share

SBI – Indian Oil Credit Card: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరుసగా పెరుగుతున్న ధరలను చూసి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం.. రవాణా చార్జీలపై పడుతుండటం.. వాటి ప్రభావం నిత్యావసరాలపైనా పడుతుండటం.. అది చివరికి ప్రజలకే భారంగా మారుతుండటంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను చూసి సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ స్వంత వాహనాలపై ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. అయితే, ఈ పెరుగుతున్న ధరలను దృష్టిలో ఇండియన్ ఆయిల్ కంపెనీ-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేశాయి. ‘మీకు ఎస్‌బీఐలో ఖాతా ఉంటే పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై డిస్కౌంట్ పొందవచ్చు’ అంటూ స్టేట్ బ్యాంక్-ఇండియన్ ఆయిల్ కంపెనీ సంయుక్తంగా రూపే డెబిట్ కార్డును విడదల చేశాయి. పెట్రోల్, డీజిల్ కొనుగోలు కోసం ఈ కార్డును వినియోగించడం ద్వారా వాహనదారులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

ఎస్‌బీఐ-ఐఓసీ కార్డు ప్రయోజనాలేంటి? ఎస్‌బీఐ-ఐఓసీ విడుదల చేసిన ఈ కార్డు పూర్తిగా కాంటాక్ట్‌లెస్‌గా ఉంటుంది. ఈ కార్డును స్వైప్ చేయకుండా, స్కానింగ్ ద్వారా మీ ఖాతాలోని డబ్బు పెట్రోల్ బంక్ యాజమాన్యానికి చేరుతుంది. కారులో గానీ, బైక్‌లో గానీ పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించినప్పుడు ఈ కార్డు వినియోగించడం ద్వారా 0.75 శాతం రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. హోటళ్ళు, సినిమాలు, ఏదైనా బిల్లు చెల్లించడానికి ఈ రివార్డ్ పాయింట్లను ఉపయోగించవచ్చు. ఈ కార్డు ఇలా ఉంటే.. దేశ వ్యాప్తంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల వినియోగానికి సంబంధించి ఇతర పెట్రోలియం సంస్థలతోనూ ఒప్పందం చేసుకుని వినియోగదారులకు డిస్కౌంట్లు అందిస్తోంది.

ఎస్‌బీఐ మరియు బీపీసీఎల్ ఆక్టేన్ కార్డులు? కొద్ది రోజుల క్రితం ఎస్‌బీఐ, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కొత్త క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టాయి. పెట్రోల్-డీజిల్ కోసం ఈ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించే వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంధనం కోసం ఎక్కువ ఖర్చు చేసే వినియోగదారులకు ఆదా చేయాలనే లక్ష్యంతో ఈ కార్డును లాంచ్ చేసినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ క్రెడిట్ కార్డు పేరు బీపీసీఎల్-ఎస్‌బీఐ ‘కార్డ్ ఆక్టేన్’. ఈ క్రెడిట్ కార్డు వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా బీపీసీఎల్ డీజిల్, పెట్రోల్, భారత్ గ్యాస్ (ఎల్‌పిజి) వంటి వాటి కోసం ఖర్చు చేస్తే 25 రివార్డ్ పాయింట్లు వస్తాయి.

బీపీసీఎల్ రాయితీలు.. ‘కార్డ్ ఆక్టేన్’ ద్వారా బీపీసీఎల్ పెట్రోల్ పంపుల వద్ద డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేసినట్లయితే 7.25 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే భారత్ గ్యాస్ కోసం ఈ కార్డును వినియోగిస్తే 6.25 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. బీపీసీఎల్ ఎష్‌బీఐ ‘కార్డ్ ఆక్టేన్’ కార్డును వినియోగదారులు దేశవ్యాప్తంగా 17,000 బీపీసీఎల్ పెట్రోల్ పంపుల వద్ద వినియోగిస్తున్నారు. ఈ కార్డు ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసిన ప్రతీసారి ఎంతోకొంత ప్రయోజనం పొందుతున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-పేటీఎంల భాగస్వామ్యం.. అంతకుముందు, ఎస్‌బీఐ – పేటీఎమ్ తో కలిసి రెండు క్రెడిట్ కార్డు ఆఫర్లను ప్రారంభించాయి. అవి పేటీఎమ్ ఎస్‌బీఐ, పేటీఎమ్ ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్. ఈ రెండూ వీసా కార్డులు. క్రెడిట్ కార్డు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి, వినియోగదారులకు లబ్ధి చేకూర్చడానికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయని సదరు సంస్థలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.

Also read:

Covid Vaccine Price: కోవిడ్ వ్యాక్సిన్ ఇక మరింత విరివిగా.. ధర నిర్ణయించిన సర్కార్.. ప్రైవేటులో వంద అదనం

Night Curfew: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. మరో 15 రోజుల పాటు నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు