Airtel, Reliance Jio: జియోకు షాకిస్తున్న ఎయిర్‌టెల్‌.. మెరుగైన సిగ్నల్‌తో వినియోగదారులకు గాలం

Airtel, Reliance Jio: ప్రస్తుతం పోటీ ప్రపంచంలో టెలికం సంస్థలు నువ్వా.. నేనా అన్నట్లు దూసుకుపోతున్నాయి. ప్రముఖ టెలికం సంస్థలు అయిన రిలయన్స్‌ జియో..

Airtel, Reliance Jio: జియోకు షాకిస్తున్న ఎయిర్‌టెల్‌.. మెరుగైన సిగ్నల్‌తో వినియోగదారులకు గాలం
Follow us
Subhash Goud

|

Updated on: Feb 27, 2021 | 7:46 PM

Airtel, Reliance Jio: ప్రస్తుతం పోటీ ప్రపంచంలో టెలికం సంస్థలు నువ్వా.. నేనా అన్నట్లు దూసుకుపోతున్నాయి. ప్రముఖ టెలికం సంస్థలు అయిన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, ఐడియా వోడిఫోన్‌లు సబ్‌ స్క్రైబర్లను పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. టెలికం సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు రోజురోజుకు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ఆకర్షించుకుంటున్నాయి. ఇప్పటి వరకు రిలయన్స్‌ జియో ఆకట్టుకునే ఆఫర్లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకట్టుకుంటుండగా, తాజాగా ఎయిర్‌టెల్‌ జియో, ఐడియా వోడాఫోన్‌ సంస్థలను బీట్‌ చేసింది. ప్రస్తుతం టెలికం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియోకు ఎయిర్‌టెల్‌ భారీగా దెబ్బ కొట్టింది. గత ఏడాదిలో ఏకంగా 4.05 మిలియన్ల మంది వైర్‌లెస్‌ సబ్‌ స్క్రైబర్లను సంపాదించుకుంది. అంతేకాదు నెలవారీ సబ్‌స్రైబర్ల విషయంలో అగ్రస్థానాన్ని నిలిచింది.

టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపిన ప్రకారం.. గత సంవత్సరం డిసెంబర్‌లో రిలయన్స్‌ జియోకు 4,79,000 మంది వైర్‌లెస్ ఖాతాదారులు మాత్రమే సంపాదించుకోగా విజిటర్ లొకేషన్ రిజిస్టర్ (వీఎల్ఆర్)లోనూ జియోను ఎయిర్‌టెల్ అందుకుంది. తాజాగా వచ్చి చేరిన 4.05 మిలియన్ల మందితో కలుపుకొని గత సంవత్సరం డిసెంబర్‌ 31 నాటికి ఎయిర్‌ టెల్‌ వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్ల మొత్తం సంఖ్య 338.7 మిలియన్ల వరకు చేరింది. ఎయిర్‌టెల్ మార్కెట్ షేర్ 29.36గా ఉంది. అంతకుముందు నెల అది 28.97 గా ఉంది. ఇక, జియోకు డిసెంబరు నెలలో 478,917 మంది ఖాతాదారులు మాత్రమే వచ్చి చేరారు.

మార్కెట్‌ షేర్‌ 35.43 శాతంగా ఉంది. అంతకు ముందు నెల 35.34 శాతంతో పోలిస్తే స్వల్ప పెరుగుదల కనిపించింది. ఇక ఇదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 252,501 మంది ఖాతాదారులను కోల్పోగా వొడాఫోన్‌ ఐడియా 5.69 మిలియన్ల మంది ఖాతాదారులను కోల్పోయింది. ఇలా దేశంలో ప్రముఖ టెలికం సంస్థలు పోటీ పడుతున్నాయి. ఒకరికంటే కస్టమర్లను ఆకట్టుకుని చేర్చుకోవాలని తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

ఆకట్టుకునే ఆఫర్లు :

కాగా, వినియోగదారులను ఆకట్టుకునే విధంగా పలు టెలికం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రోజురోజుకు ఆకట్టుకునే విధంగా ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులకు గాలం వేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎయిర్‌ టెల్‌ వినియోగదారులను ఆకర్షించే విధంగా అతి తక్కువ రీచార్జ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో భారీగా కొత్త కస్టమర్లు కూడా వచ్చి చేరినట్లయింది. కేవలం రూ.19 మాత్రమే రీచార్జ్‌ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకునే ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చని భారతీయ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ప్లాన్‌ వాలిడిటీ కేవలం రెండు రోజులు మాత్రమే. ఎయిర్‌టెల్ ఈ రీచార్జ్ ప్లాన్‌ను ‘ట్రూలీ అన్‌లిమిటెడ్’ కేటగిరి కింద అందిస్తోంది. అంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చని అర్థం. మొత్తంమీద రెండు రోజులు వాలిడిటీ అయినా రూ.19కే అన్‌లిమిటెడ్ కాల్స్ అనేది మంచి ప్లానేనని వినియోగదారులు చెప్పుకొంటున్నారు. అంతేకాదు.. 200 ఎంబీ డేటా కూడా వస్తుంది.

365 రోజుల వ్యాలిడిటీతో మరో ఆఫర్..

కాగా, ఇదే కాకుకుండా ప్రతీనెలా , లేదంటే మూడు నెలలకోసారి రీచార్జ్‌ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఒకేసారి సంవత్సరానికి రీచార్జ్‌ చేసుకోవచ్చు కూడా. దీనికి రూ. 2698 ప్లాన్ అందుబాటులో ఉంది. దీని వాలిడిటీ 365 రోజులు. రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. దీంతో పాటు… డిస్నీ హాట్‌స్టర్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగానే లభించనుండడం విశేషం. తమ కొత్త ప్లాన్ వినియోగదారులకు పూర్తి వెసులుబాటుగా ఉంటుందని ఎయిర్‌టెల్ చెబుతోంది.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే